Site icon NTV Telugu

Lockdown: ఢిల్లీలో లాక్ డౌన్ దిశగా అడుగులు.. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు

Delhi

Delhi

ఢిల్లీలో పండుగల సీజన్‌లో పరిస్థితి దారుణంగా మారింది. ఢిల్లీ ప్రజలు గాలి పీల్చుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ వాయు నాణ్యత సూచీ తాజాగా 302కి చేరింది. ఢిల్లీలో సగటు ఎయిర్‌ క్వాలిటీ సూచీ 200 నుంచి 300 మధ్య ఉంది. రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారిపోతుంది. అయితే, దీపావళి పండగకి ముందే ఈ పరిస్థితికి వచ్చింది. ఇక, దీపావళి పండుగ తరువాత పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. మొన్న ఆదివారం ఉదయం ఢిల్లీ ఏక్యూఐ 266గా ఉంది. శనివారం ఈ సంఖ్య 173గా నమోదు అయింది. ఎస్‌ఏఎఫ్‌ఏఆర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇవాళ మధ్యాహ్నానికి 330కి చేరుకుంటోందని తెలిపింది. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని నిపుణులు వెల్లడించారు.

Read Also: Ganesh Pooja : వినాయకుడికి పొరపాటున కూడా ఈ వస్తువులు సమర్పించకండి..

ఇక, ఢిల్లీ నగరంలో వాతావరణం రోజురోజుకు మరింత దిగజారుతుండటంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ భయాందోళన వ్యక్తం చేస్తుంది. జనం ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను వినియోగించాలని అధికారులు సూచించారు. పార్కింగ్‌ ఫీజులు పెంచాలని, ఎలక్ట్రిక్‌ బస్సులు, మెట్రో సర్వీసులను పెంచాలని చెప్పారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఈ నోటీసులు జారీ చేసింది. కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగితే, కొత్త ఆంక్షలు అమలు చేసే అవకాశముందని తెలుస్తుంది.

Read Also: Kangana Raunat: రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన కంగనా రనౌత్..

అయితే, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యం స్టేజ్-3కి చేరుకుంటే, బీఎస్‌-III, బీఎస్‌-IV వెహికిల్స్ ను నిషేధించే అవకాశం ఉంది. అత్యవసర సేవల వెహికిల్స్ కూడా పరిమితులు విధించే ఛాన్స్ ఉంది. రైల్వేలు, జాతీయ భద్రతా ప్రాజెక్టులు, హస్పటల్స్, మెట్రో, హైవేలు, రోడ్లు మినహా ఇతర ప్రాజెక్టులను అధికారులు నిలిపివేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే హైవేలు, రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్లు, పైప్‌లైన్ల పనులు కూడా ఆగిపోతాయి. ఇక, విద్యాసంస్థలను కూడా మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనాలకు సంబంధించి బేసి-సరి ఫార్ములా తిరిగి అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే ప్రైవేట్, ప్రభుత్వ ఆఫీసులకు 50 శాతం సామర్థ్యంతో పని చేసేవిధంగా పర్మిషన్లు ఇవ్వనున్నారు. అలాగే కొన్ని సంస్థలలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేసే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.

Exit mobile version