IPL 2024లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన నెలకొంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ ఒకరినొకరు కలుసుకున్నారు. వీరు తమ మధ్య ఉన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే, ఆర్సీబీ ఇన్సింగ్ టైమ్ అవుట్ సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గంభీర్ విరాట్ తో కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు కౌగిలించుకోవడం కనిపించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Read Also: Call Forwarding : ఏప్రిల్ 15నుంచి కాల్ ఫార్వార్డింగ్ సర్వీసు నిలిపివేత
అయితే, ఢిల్లీ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ, గంభీర్‌ల ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఏ సమస్య వచ్చినా సహాయం చేయడానికి 112 సిద్ధంగా ఉంది’ అని రాసుకొచ్చారు. ఈ ఫోటో గురించి చెబుతూ.. ఏదైనా ‘ఒక గొడవ జరిగిందా? 112కు డయల్ చేయండి.. దాన్ని మేము పరిష్కరిస్తాం.. ఏ గొడవ పెద్దది కాదు అంటు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టంట తెగ వైరల్ అవుతుంది. ఇక, ఐపీఎల్ చివరి సీజన్‌లో, గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీతో మైదానంలో గొడవకు దిగాడు.. అలాగే, ఐపీఎల్ 2013 లో గంభీర్ KKR కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా కోహ్లీతో కూడా గొడవపడ్డాడు.. ఈ గొడవకు సంబంధించి కూడా గతంలో ఢిల్లీ పోలీసులు పోస్ట్ చేశారు.. ఈలాంటి గొడవలు జరిగిన సరే 112కు డయల్ చేయండి అని తెలిపారు.
Kisi bhi problem mein madad ke liye 112 hai taiyaar!#RCBvKKR#IPL2024#IPL#Dial112 pic.twitter.com/TUm1ZKd416
— Delhi Police (@DelhiPolice) March 29, 2024