Delhi Government: ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ సరికొత్త ఐఫోన్ 16 ప్రోలను అందజేసింది. కేంద్రం తీసుకొచ్చిన “వన్ నేషన్, వన్ అప్లికేషన్” కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ అమలులో ముందుడువేస్తూ సోమవారం శాసన సభ్యులందరికీ సరికొత్త ఐఫోన్ 16 ప్రోలను అందజేసింది. వర్షాకాల సమావేశాల మొదటి రోజు ఫోన్ల పంపిణీ ముఖ్యాంశాల్లో నిలిచింది.
READ MORE: Singireddy Niranjan Reddy : కమిషన్లు కోర్టులు కావు.. నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
70 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్‌లు
ప్రభుత్వం కాగిత రహిత పాలనలో తీసుకొచ్చిన ఫస్ట్ స్టెఫ్‌గా ఢిల్లీ అసెంబ్లీలోని 70 మంది ఎమ్మెల్యేకు సరికొత్త ఐఫోన్ 16 ప్రోను అందజేసినట్లు విధానసభ సెక్రటేరియట్ అధికారి ఒకరు తెలిపారు. ఎమ్మెల్యేలందరూ ఇప్పటి నుంచి వారివారి అధికారిక కార్యక్రమాల్లో వీటిని వినియోగిస్తారని పేర్కొన్నారు. సీఎం రేఖ గుప్తాతో సహా అందరు ఎమ్మెల్యేలకు ఐఫోన్లతో పాటు, ఐప్యాడ్‌లు, టాబ్లెట్‌లను కూడా అందజేశారు. టెక్-ఆధారిత పరిజ్ఞానం, కాగిత రహిత పాలనపై ప్రజాప్రతినిధులకు అవగాహన తీసుకురాడవంలో భాగంగా ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఈ స్మార్ట్‌ఫోన్‌లను అందజేసినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక స్పష్టం చేసింది.
ట్రైనింగ్ తీసుకున్న ఎమ్మెల్యేలు..
గత నెలలో డిజిటల్ ఇంటర్‌ఫేస్ వాడకంపై ఎమ్మెల్యేలందరూ శిక్షణ పొందినట్లు అధికారులు పేర్కొన్నారు. శిక్షణలో మైక్రోఫోన్‌లు ఓటింగ్ ప్యానెల్‌లతో కూడిన స్మార్ట్ డెలిగేట్ యూనిట్లు, RFID/NFC (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) యాక్సెస్, బహుభాషా మద్దతు, ఐప్యాడ్‌ల ద్వారా రియల్-టైమ్ డాక్యుమెంట్ యాక్సెస్, HD కెమెరాలతో కూడిన ఆటోమేటెడ్ AV సిస్టమ్, సురక్షితమైన, పవర్-బ్యాక్డ్ నెట్‌వర్కింగ్ వాతావరణం పని తీరును వారు తెలుసుకున్నట్లు తెలిపారు.
READ MORE: PM Modi: గాల్వాన్ లోయ వివాదం తర్వాత.. తొలిసారి చైనాలో పర్యటించనున్న ప్రధాని మోడీ
