NTV Telugu Site icon

Viral Video: ఏంటీ భయ్యా ఇది..మెట్రో రైల్లో మహిళల కుస్తీ..మరీ దారుణం..

delhi metro

delhi metro

మెట్రో లో ప్రయాణం సులువుగా ఉంటుంది దాంతో జనాలు ధర ఎక్కువ ఉన్నా కూడా మెట్రో లో ప్రయాణాన్ని చేస్తున్నారు.. ఇక ఈ మధ్య ఢిల్లీ మెట్రోలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. నిత్యం ఏదో ఒక భిన్నమైన చర్యతో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంది. మెట్రోలో రొమాన్స్, ఫన్నీ డ్యాన్సులు, ఫైటింగ్‌లు లాంటి వీడియోలు చేసి నెట్టింట పోస్ట్‌ చేస్తుంటారు. సోషల్ మీడియాలో వ్యూస్‌కోసం, లైకులు, షేర్ల కోసం చాలా మంది తమ టాలెంట్‌ను ప్రదర్శించటానికి ఢిల్లీ మెట్రోనే వేదికగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఢిల్లీ మెట్రోను వార్తల్లోకెక్కిలా చేస్తుంది. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది..

గత కొన్ని రోజులుగా మెట్రోలో రీల్స్, ఫైట్లు, రొమాన్స్‌కు ప్రసిద్ధి చెందింది. అవును, ప్రతిరోజూ మెట్రో నుంచి వచ్చే ప్రయాణికుల వీడియోలు సోషల్ మీడియాలో అనేకం తెరపైకి వస్తున్నాయి. అదేలాగంటే.. ‘బిగ్ బాస్’ కంటే మెట్రో ఇప్పుడు మరింత వినోదాత్మకంగా మారిందని సోషల్ మీడియా యూజర్లు చెప్పడం మొదలుపెట్టారు.. తాజాగా కొంతమంది మహిళల మధ్య సీటు కోసం గొడవ జరిగింది.. సీటు కోసం భీకర యుద్ధం చేశారు.. ఆ గొడవ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

సీటు విషయంలో కొంతమంది మహిళలు, అమ్మాయిల మధ్య గొడవ జరిగింది. ఇప్పటికే ఈ వీడియోని 90 వేలకు పైగా వీక్షించారు. వందల సంఖ్యలో నెటిజన్లు వీడియోపై స్పందించారు. లైక్‌లు, కామెంట్లతో హోరెత్తించారు. చాలా మంది వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు కూడా.. ఏంటి బ్రో ఈ దారుణం ఏసీ కన్నా సీటు కావాలని బట్టలు చిరిగేలా కొట్టుకోవడం ఏంటో అంటూ విడ్డురంగా కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో అయితే తెగ వైరల్ అవుతుంది.. ఒక లుక్ వేసుకోండి..