Site icon NTV Telugu

Delhi Metro Fare Hike: పెరిగిన మెట్రో ఛార్జీలు.. 8 సంవత్సరాల తర్వాత..!

Delhi Metro Fare Price

Delhi Metro Fare Price

Delhi Metro Fare Hike After 8 Years: డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) 8 సంవత్సరాల తర్వాత మెట్రో ఛార్జీలను పెంచింది. ఈ ఛార్జీల పెంపు ఈరోజు (ఆగస్టు 25) నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ మెట్రో యాజమాన్యం వెల్లడించింది. DMRC అన్ని మెట్రో లైన్లలో ఛార్జీలను రూ.1 నుంచి రూ.4 వరకు పెంచింది. అయితే ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో మాత్రం రూ.1 నుంచి రూ.5 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఛార్జీల పెంపు తర్వాత కూడా స్మార్ట్ కార్డులను ఉపయోగించే ప్రయాణీకులకు ప్రతి ట్రిప్‌లో 10 శాతం తగ్గింపు, అలాగే ఆఫ్-పీక్ సమయాల్లో అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

దేశంలోనే అతి పొడవైన మెట్రో నెట్‌వర్క్ కావడంతో ఢిల్లీ మెట్రో స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. DMRC ప్రకారం, ఇప్పుడు ఢిల్లీ మెట్రో కనీస ఛార్జీ రూ.11గా, గరిష్ట ఛార్జీ రూ.64గా ఉంది. ఈ మార్పు 8 సంవత్సరాల తర్వాత చేయబడింది. ఇది లక్షలాది మంది ప్రయాణికుల ఖర్చులను ప్రభావితం చేస్తుంది. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో ఛార్జీలు రూ.5 వరకు పెరిగాయి. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వెల్లడించింది. ఆపరేషన్ ఖర్చు, సేవా నాణ్యతను నిర్వహించడానికి ఈ ఛార్జీల పెంపు జరిగిందని DMRC తెలిపింది.

Also Read: Harsh Goenka-BCCI: టీమిండియాకు జెర్సీ స్పాన్సర్‌ చేస్తే.. కంపెనీ మూసుకోవాల్సిందే!

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిర్వహణ వ్యయం కారణంగా ఈ చర్య తీసుకోవడం అత్యవసరం అయింది. రాఖీకి ముందు ఆగస్టు 13న ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య మెట్రో చరిత్రలోనే అత్యధికం. ఈ సంవత్సరం ఆగస్టు 13న ఒకే రోజులో 72 లక్షలకు పైగా ప్రజలు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. అయితే ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఇందుకు ఏమాత్రం తక్కువ కాదు.

Exit mobile version