Site icon NTV Telugu

Serial Killer: 30 మంది చిన్నారుల హత్య.. వీడికి జీవిత ఖైదు కూడా చాలా చిన్న శిక్షే

Delhi Man Who Raped Killed Child Gets Life Term He S Accused In 30 Cases

Delhi Man Who Raped Killed Child Gets Life Term He S Accused In 30 Cases

Serial Killer: మైనర్ బాలికలను హత్య చేసి అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సైకోకిల్లర్ రవీంద్ర కుమార్‌కు ఢిల్లీ రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2008 నుంచి 2015 మధ్య కాలంలో 30 మంది చిన్నారులను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో రవీందర్ ప్రమేయం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం మూడు కేసులు మాత్రమే విచారణకు వచ్చాయి. రవీందర్ ఒక సీరియల్ రేపిస్ట్, కిల్లర్. ఢిల్లీలో కూలీగా పనిచేసే అతడు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. 7 ఏళ్లలో 30 మంది చిన్నారులపై అత్యాచారం చేసి చంపేశాడు. అతను ఢిల్లీ-ఎన్‌సిఆర్, పశ్చిమ యూపీ ప్రాంతాల్లో పలు మార్లు చిన్నారులపై అత్యాచారాలకు ఒడిగట్టాడు.

Read Also:Akash Madhwal: నా సామర్థ్యం మేరకు బౌలింగ్ చేస్తా..

హంతకుడు రవీందర్ స్వయంగా నేరం అంగీకరించాడు. 2008లో తాను ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌ నుంచి ఢిల్లీకి వచ్చానని చెప్పాడు. అప్పటికి అతని వయస్సు 18ఏళ్లు. తన తండ్రి ప్లంబర్‌గా పనిచేసేవాడు. ఆయన తల్లి ప్రజల ఇళ్లలో పని చేస్తుండేది. ఢిల్లీకి వచ్చిన తర్వాత రవీందర్ మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. అంతేకాకుండా పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నాడు. రవీందర్ రోజూ సాయంత్రం మద్యం తాగడం లేదా మందు తాగడం, ఆపై తన టార్గెట్‌ను వెతుక్కుంటూ బయటకు వెళ్లేవాడు. ఇందుకోసం రోజుకు 40 కిలోమీటర్లు నడిచేవాడు. మొదట 2008లో బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. మొదటి సారి నేరం చేసి పట్టుబడకపోవడంతో అతనిలో ధైర్యం పెరిగింది. తర్వాత అదే అతని దినచర్యగా మారింది. పిల్లలను ఆకర్షించేందుకు రూ.10 నోట్లు లేదా చాక్లెట్లతో ప్రలోభపెట్టేవాడినని రవీందర్ తెలిపాడు. తర్వాత వారిని కిడ్పాప్ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి.. వారిపై అత్యాచారం చేసి తర్వాత చంపేస్తాడు. ఇలా 7 ఏళ్లలో 6 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారం చేశాడని దోషి తన వాంగ్మూలంలో తెలిపాడు.

Read Also:Bihar: ఏం కొట్టుకున్నారు.. అబ్బా అబ్బా.. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‎ను మించి..

2014లో తొలిసారిగా రవీంద్రకుమార్ పోలీసులకు చిక్కాడు. 6 ఏళ్ల చిన్నారిపై కిడ్నాప్, హత్యాయత్నం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతనిపై అభియోగాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత అతడిని విడుదల చేశారు. దీని తరువాత.. 2015 లో 6 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును విచారిస్తున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఢిల్లీలోని రోహిణిలోని సుఖ్‌బీర్ నగర్ బస్టాండ్ సమీపంలో అతడిని పట్టుకున్నారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు డజన్ల కొద్దీ సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఇన్‌ఫార్మర్లను కూడా విచారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రవీందర్ బాలికను అపహరించి, అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. హత్య చేసి బాలిక మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. ఈ కేసులో కోర్టు అతడిని దోషిగా తేల్చింది.

Exit mobile version