Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Delhi High Court To Pass Order At 315pm Today On A Plea Moved By Kejriwal Challenging His Arrest By The Ed

Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ సమయం మార్పు.. ఎప్పుడంటే..!

Published Date :April 9, 2024 , 2:49 pm
By Suresh Maddala
Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ సమయం మార్పు.. ఎప్పుడంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ విచారణ సమయంలో మార్పు జరిగింది. తొలుత మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అయితే ఈ సమాయాన్ని మధ్యాహ్నం 3:15 గంటలకు మార్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం 3:15 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించనున్నారు. అయితే న్యాయస్థానం జడ్జిమెంట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బెయిల్ వస్తుందన్న ఆశతో ఆప్ నేతలు ఎదురుచూస్తున్నారు.

మార్చి 21న మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఇక బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏప్రిల్ 3న ఈడీ, కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసులో తన నిర్ణయాన్ని ఏప్రిల్ 9కు రిజర్వ్ చేశారు. మరికాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. బెయిల్ వస్తుందా? లేదంటే మరోసారి వాయిదా వేస్తుందా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది.

ఇదిలా ఉంటే ఇదే కేసులో ఆప్ నేత సంజయ్‌సింగ్‌కు బెయిల్ లభించింది. ఆరు నెలల్లోనే ఆయనకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. జైలు నుంచే పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే.. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడి లేడు. దీంతో కేజ్రీవాల్‌కు బెయిల్ రావాలని ఆప్ నేతలు కోరుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • arrest
  • Delhi High Court
  • ED
  • excise policy
  • Kejriwal challenging

తాజావార్తలు

  • LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..

  • US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..

  • KL Rahul: సూపర్ రివెంజ్.. KL రాహుల్ గోల్డెన్ డక్‌పై LSG స్టెయిర్‌కేస్ ట్రోల్.. DC గెలుపుతో బ్యాక్ ట్రోల్!

  • US-Iran War: హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణ.. యూఎస్-ఇరాన్ చర్చలు..!

  • Liquor Sales: భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత తాగేశారంటే..?

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions