Site icon NTV Telugu

Delhi Govt: ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ఒలింపిక్ విజేతలకు రూ. 7 కోట్ల రివార్డ్

Laptap

Laptap

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి బోర్డు పరీక్షలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల 1200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందించాలని నిర్ణయించింది. ఒలింపిక్స్, ఆసియాడ్, కామన్వెల్త్ క్రీడల వంటి అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు, అథ్లెట్లకు బహుమతి డబ్బును పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఒలింపిక్ క్రీడల విజేతలకు 3 కోట్లు, 2 కోట్లు, 1 కోటి రూపాయలు ఇచ్చేవారు.

Also Read:Pawankalyan : వెయ్యి కేజీల పేపర్లు రెడీ చేసిన ఫ్యాన్స్.. థియేటర్లలో ఇక రచ్చే..

ఇప్పుడు దానిని గోల్డ్ మెడల్ కి 7 కోట్లు, సిల్వర్ కి 5 కోట్లు, కాంస్యానికి 3 కోట్లుగా మార్చారు. అదేవిధంగా, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, జాతీయ క్రీడల పతక విజేతలకు బహుమతి మొత్తాన్ని పెంచారు. పొరుగు రాష్ట్రాలు గతంలో ఆటగాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేవి, కాబట్టి ఒలింపిక్స్‌లో బంగారు, వెండి పతకాలు గెలుచుకున్న వారికి గ్రూప్ A ఉద్యోగాలు, ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు గెలుచుకున్న వారికి గ్రూప్ B ఉద్యోగాలు ఇవ్వనున్నారు.

Also Read:HHVM : వీరమల్లుకు ప్రీమియర్ షోలు సాధించిన రోహిన్ రెడ్డి.. ఎవరితను..?

అదేవిధంగా, ఇతర క్రీడలలో పతకాలు సాధించిన వారికి A, B, C కేటగిరీ ఉద్యోగాలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. పాఠశాల విద్యలో, ఢిల్లీ ప్రభుత్వం ప్రతి జాతీయ, రాష్ట్ర క్రీడాకారుడికి రూ. 5 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఎలైట్ క్రీడాకారులకు ప్రతి సంవత్సరం రూ. 30 లక్షలు ఇస్తున్నారు. మంచి మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, విద్యార్థుల చదువు సజావుగా సాగేలా 1200 మంది మెరిటోరియస్ విద్యార్థులకు I-7 ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు.

Exit mobile version