Holi Gift: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కార్ హోలీకి ముందు ఢిల్లీ వాసులకు శుభవార్త చెప్పింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొదటి ఏడాదిని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఆమె మంత్రివర్గం పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే ప్రతిపాదనను ఆమోదించింది. సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి రూ.242 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నిర్ణయం పేదలకు ఎంతో ఉపయోగపడేదిగా అభివర్ణించారు.
READ ALSO: Takshakudu Teaser: ఆసక్తిగా ‘తక్షకుడు’ టీజర్.. సరికొత్త అవతార్‌లో ఆనంద్ దేవరకొండ!
ఈ హోలీ నుంచి ఈ పథకం ప్రయోజనాలను పేదలకు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బడ్జెట్ కేటాయింపు తర్వాత సీఎం రేఖ గుప్తా మాట్లాడుతూ.. రేషన్ కార్డుదారులకు సిలిండర్ కోసం రూ.853 ప్రత్యక్ష బదిలీని అందిస్తామని వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మధ్యవర్తుల భయాన్ని తొలగించడంతో పాటు ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేఖ గుప్తా చేసిన ప్రకటనతో, ఏడాది క్రితం బీజేపీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నట్లు అయ్యింది. ఆ సమయంలో కమలం పార్టీ నాయకులు మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని హామీ ఇచ్చారు.
READ ALSO: AC Coaches Missing: తప్పిపోయిందా? తప్పించుకొని పోయారా? రైలు నుంచి ఏసీ కోచ్ మిస్సింగ్..
