NTV Telugu Site icon

Air India Urination Case: కో పాసింజర్‌పై మూత్ర విసర్జన కేసులో శంకర్ మిశ్రాకు బెయిల్

Shankar

Shankar

ఎయిరిండియా మూత్ర విసర్జన కేసులో నిందితుడు శంకర్ మిశ్రాకు బెయిల్ లభించింది. రూ.లక్ష పూచికత్తుపై ఢిల్లీ కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఓసారి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయగా.. నిందితుడి అభ్యర్థనను మరోసారి స్వీకరించిన అడిషనల్ సెషన్స్ జడ్జి హరిజ్యోత్ సింగ్ భల్లా అతడికి బెయిల్ ఇచ్చారు. కాగా.. గతేడాది నవంబర్‌ 26వ తేదీన న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా మద్యం మత్తులో తన తోటి ప్రయాణికురాలైన ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డిసెంబర్ 4వ తేదీన వాళ్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు గురించి తెలుసుకున్నాక.. శంకర్ మిశ్రా పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం పారిపోయాడు. అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత.. బెంగళూరులో అతడ్ని అరెస్ట్ చేశారు.

Rangamarthanda: రాజశేఖర్ కూతురితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..?