Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతిత తెలిసిందే. ఆయనకు చాలా కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయంలో ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఏప్రిల్ 18న ఈడీ రెవెన్యూ కోర్టులో, ‘కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉద్దేశపూర్వకంగా స్వీట్లు తింటున్నాడు, తద్వారా అతని షుగర్ స్థాయి పెరుగుతుంది. అతను వైద్య కారణాలపై బెయిల్ పొందాలని చూస్తున్నాడు’ అంటూ ఆరోపించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ షుగర్ లెవెల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ ఓ ప్రకటన విడుదల చేశారు. అరవింద్ కేజ్రీవాల్ చాలా ఏళ్లుగా డయాబెటిస్ పేషెంట్‌గా ఉన్నారని, ఆయన షుగర్ లెవెల్‌లో హెచ్చుతగ్గులు ఉంటాయని ఆయన అన్నారు.
Read Also:Ayodhya: అయోధ్య వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్..
ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా షుగర్ వ్యాధి వ్యాపిస్తోందన్నారు. ఇన్సులిన్‌పై సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. రోగికి ఇన్సులిన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసునన్నారు. ఇన్సులిన్ సకాలంలో అందకపోతే రోగికి ఏదైనా జరగవచ్చని అన్నారు. సందీప్ పాఠక్ ఈడీపై ప్రశ్నలు లేవనెత్తారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎప్పుడు, ఏ ఔషధం తీసుకోవాలో ఇప్పుడు ఈడీ నిర్ణయిస్తుందని అన్నారు. మందు వేసుకునే హక్కు కూడా రోగికి లేదా? అని ప్రశ్నించారు.
Read Also:MS Dhoni: క్రికెటరై ఆ బంతిని వేరే అభిమానికి ఇస్తా.. ధోని నుండి బంతిని బహుమతిగా పొందిన పాప..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత 30 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రతిరోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటున్నారని ఆప్ నేత అతిషి కూడా ఈ విషయంపై చెప్పారు. కేజ్రీవాల్ షుగర్ స్థాయిని పెంచేందుకు స్వీట్ ఫుడ్ తింటున్నారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన వాదన అబద్ధమని ఢిల్లీ మంత్రి అతిషి పేర్కొన్నారు. కేజ్రీవాల్ తన టీలో వైట్ షుగర్ తీసుకోలేదని, కానీ క్యాలరీలు తక్కువగా ఉండే ఎరిథ్రిటాల్ అనే స్వీటెనర్ తీసుకుంటున్నారని, ఆయన డాక్టర్ సూచించారని అతిషి చెప్పారు. కేజ్రీవాల్ స్వీట్లు, స్వీట్ టీ తీసుకుంటారని ED చెప్పిందని అతిషి చెప్పారు. కానీ ఇవి ఎరిథ్రిటాల్‌తో తయారు చేయబడ్డాయి. కావాలంటే గూగుల్లో బీజేపీ వాళ్లు సెర్చ్ చేయవచ్చని పేర్కొన్నారు.
