Aravind Kejriwal : నేడు కోర్టుకు సీఎం కేజ్రీవాల్.. అరెస్ట్ పై నిరసన తెలుపనున్న ఆప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన ఈరోజు రోస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కేజ్రీవాల్ సీబీఐ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. జూన్ 26న సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది. దీంతో కోర్టు అతడిని మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. రూస్ అవెన్యూ కోర్టులో సిబిఐ సిఎం కేజ్రీవాల్‌ను ఐదు రోజుల కస్టడీని కోరింది. అయితే ఏజెన్సీకి కోర్టు నుండి 3 రోజుల రిమాండ్ మాత్రమే లభించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ట్రయల్ కోర్టు నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
Read Also:Madhya Pradesh: మహిళలు తమ భర్తల్ని ఇంట్లోకే మద్యం తెచ్చుకోని తాగమనండి.. మంత్రి సలహా..
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాపై పూర్తి నిందలు మోపారని, ఈ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాను జైలులో పెట్టారని సీబీఐ కోర్టులో పేర్కొంది. ఎక్సైజ్ పాలసీపై తనకు ఎలాంటి అవగాహన లేదని కేజ్రీవాల్ చెప్పినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. సీబీఐ చేసిన ఈ ప్రకటనపై కేజ్రీవాల్ మాట్లాడుతూ నేను సిసోడియాపై ఎలాంటి నిందలు వేయలేదు. నేను కూడా నిర్దోషినే, సోసాదియా కూడా నిర్దోషి అని కేజ్రీవాల్ అన్నారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందు కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ 20న బెయిల్ లభించిందని చెప్పారు. ఈడీ వెంటనే స్టే తెచ్చుకుంది. ఆ మరుసటి రోజే సీబీఐ అతడిని నిందితుడిగా చేసి అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాకుండా చూసేందుకు మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తోంది. ఇది చట్టం కాదు. ఇది నియంతృత్వం అన్నారు.
Read Also:Margani Bharat: మాజీ ఎంపీ ప్రచార రథాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!