Arvind Kejriwal: పెరిగిన నీటి బిల్లులపై అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చిన ఢిల్లీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Chief Minister: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన నివాసంలో జరిగే ఈ సమావేశంలో దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన నీటి బిల్లుల అంశంపై చర్చించనున్నారు. పెరిగిన నీటి బిల్లుల కోసం ఢిల్లీ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని తీసుకురావాలని చూస్తుంది.
Also Read
అయితే, వాస్తవానికి పెరిగిన నీటి బిల్లులకు సంబంధించి వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ పథకంపై చర్చ సందర్భంగా తీవ్ర దుమారం రేగింది. అంతకు ముందు 2023 జూన్ 14వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి దేశ రాజధానిలోని వినియోగదారులు పెండింగ్ నీటి బిల్లుల కోసం ‘వన్-టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్’ని ప్రకటించారు. ఢిల్లీలోని దాదాపు 27.6 లక్షల మంది వినియోగదారులలో 11.7 లక్షల మంది వినియోగదారులకు మొత్తం రూ.5,737 కోట్లు బకాయిలు ఉన్నాయని సీఎం కార్యాలయం తెలిపింది.
Read Also: FDI in Space : అంతరిక్ష రంగంలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన కేంద్రప్రభుత్వం
ఇక, పెరిగిన నీటి బిల్లుల వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని అధికారులు వ్యతిరేకిస్తున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. కావాలనే తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రంలోని కొందరు అధికారులు టార్గె్ట్ చేశారని పేర్కొన్నారు. అయితే, గతంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వన్-టైమ్ సెటిల్‌మెంట్ పథకం మంత్రి మండలి ముందు ప్రతిపాదనను సమర్పించడానికి పట్టణ అభివృద్ధి కార్యదర్శి నిరాకరించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..