NTV Telugu Site icon

Aravind Kejriwal : నేడు కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Arvind Kejriwal

Arvind Kejriwal

Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్‌ పిటిషన్‌లో సవాలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సీబీఐకి ఆగస్టు 23న సుప్రీంకోర్టు అనుమతినిచ్చి, కేజ్రీవాల్‌కు సమాధానం ఇచ్చేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు బెయిల్‌ లభించింది.

Read Also:V.C. Sajjanar: ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు డిసౌంట్‌ ఆఫర్‌..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ అరెస్టు, రిమాండ్ ఆర్డర్‌ను సవాలు చేశారు. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు జులై 12న సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన అనంతరం జూన్ 26న తీహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. తన అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆగస్టు 12న కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభిస్తుందా లేదా అన్న దాని మీదే అందరి చూపు ఉంది. మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా, కవిత, విజయ్ నాయర్‌లకు సుప్రీంకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌కు ఈ రోజు సుప్రీంకోర్టు నుండి ఉపశమనం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read Also:Double iSmart OTT: ఎలాంటి ప్రకటన లేకుండానే.. ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’!