NTV Telugu Site icon

వాయు కాలుష్యం ఎఫెక్ట్… వారి ఖాతాల్లో రూ.5వేలు జమ

కరోనా కారణంగా గతంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు వారికి మరో కష్టం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో భవన నిర్మాణాలపై ఆధారపడ్డ కార్మికులు కుటుంబాలు కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ మేరకు వీరిని ఆదుకోవాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది.

Read Also: ఆస్పత్రిలో చేరిన అన్నా హజారే

వాయు కాలుష్యం కారణంగా భవన నిర్మాణ పనులు ఆపి వేయడం వల్ల ఉపాధి కోల్పోయిన కాలానికి లేబర్ సెస్ కింద వసూలు చేసిన నిధులను కార్మికులకు చెల్లింపులు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో భవన నిర్మాణ కార్మికుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 5 వేలు జమ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కార్మికులకు జరగిన నష్టాన్ని తీర్చేందుకు కనీస వేతనాల ప్రకారం నష్టపరిహారం కూడా అందిస్తామని వెల్లడించారు. కాగా వాయు కాలుష్యం కారణంగా కొన్ని రోజుల పాటు స్కూళ్లను మూసివేయాలని, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేయాలని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.