Site icon NTV Telugu

Bus Driver : బస్ ఆపలేదని డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తీసేసిన ఢిల్లీ ప్రభుత్వం

Arvind Kejriwal

Arvind Kejriwal

Bus Driver : ప్రభుత్వ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదనేది ఢిల్లీ ప్రభుత్వం తాజా చర్యతో హెచ్చరించింది. దేశ రాజధానిలోని ఓ బస్ స్టాప్‌లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళల్ని ఎక్కించుకోకుండా ఆపకుండా వెళ్లిపోయిన బస్సు డ్రైవర్ ను సస్పెండ్ చేసింది. తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు చేరుకోవడంతో ఆ బస్సు డ్రైవర్ తీరుపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని హెచ్చరిస్తూ ఆ డ్రైవర్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.

Read Also: NTR: యుఎస్, యూకే అనే తేడా లేదు… ఆల్ సెంటర్స్ ని ఎన్టీఆర్ ఫాన్స్ కబ్జా

ఆ వీడియోలో.. ముగ్గురు మహిళలు బస్సు కోసం ఓ బస్ స్టాప్ లో నిలుచున్నారు. అదే దారిలో వెళ్తున్న ఓ బస్సు.. స్టాప్ లో ఆగలేదు. బస్సులోని ఓ ప్రయాణికుడిని దించేందుకు బస్సును నెమ్మదిగా పోనిచ్చిన ఆ డ్రైవర్.. ఆ బస్సు ఎక్కేందుకు పరుగులు పెట్టిన మహిళలను చూసి కూడా ఆపకుండా నడిపినట్లు వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీలో మహిళల ఇబ్బందులు అంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వ్యవహారం కేజ్రీవాల్ సర్కారు దృష్టికి వెళ్లడంతో ఆ డ్రైవర్ ను గుర్తించి వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసినట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది. సీఎం కేజ్రీవాల్ ట్వీట్ పై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ స్పందించారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు తీయాలని, వాటిని ప్రభుత్వానికి పంపితే సంబంధిత డ్రైవర్లపై, ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version