NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్ శర్మకు భారీ ఆఫర్!

Rohitsharma

Rohitsharma

Delhi Capitals approaches Mumbai Indians for Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2024కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నా.. సంచలనాలు మాత్రం ఇప్పటి నుంచే నమోదు అవుతున్నాయి. ఇటీవల గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ ట్రేడ్ చేసుకోవడం పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ముంబై యాజమాన్యం మరో నిర్ణయం తీసుకుంది. 2013 నుంచి కెప్టెన్‌గా వ్యవహిరించిన రోహిత్‌ శర్మపై వేటు వేసిన ముంబై మేనేజ్మెంట్.. హార్దిక్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు.

ముంబై ఇండియన్స్‌ ప్రాంచైజీ రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన అనంతరం సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వస్తున్నాయి. రోహిత్‌ను ట్రేడింగ్‌ ద్వారా తమ ఫ్రాంచైజీలోకి తీసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ముంబై ఇండియన్స్‌ను ఆశ్రయించిందట. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫర్ చేసిన ఒప్పందానికి ముంబై అంగీకరించలేదట. రోహిత్‌ను ఇప్పుడే వాడుకునేందుకు ముంబై సిద్ధంగా లేదట. దాంతో ఐపీఎల్ 2024లో హిట్‌మ్యాన్ బ్యాటర్‌గా మాత్రమే కనిపించనున్నాడు.

Also Read: Vemulawada: భక్తులకు అలర్ట్.. రాజన్న ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత

ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ఏడాది క్రితం కారు ప్రమాదంలో గాయపడిన పంత్.. ప్రాక్టీస్ చేస్టున్నా అందుబాటుపై ఇంకా స్పష్టత లేదు. దాంతో రోహిత్‌ శర్మను ట్రేడింగ్‌ ద్వారా తీసుకుని కెప్టెన్సీ అప్పగించాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ చూసింది. అయితే ఢిల్లీ ట్రేడింగ్‌కు ముంబై అంగీకరించలేదు. దాంతో ఐపీఎల్ 2024లో ఢిల్లీని పంత్ లేదా డేవిడ్ వార్నర్ నడిపించనున్నాడు.

 

Show comments