Site icon NTV Telugu

RR vs DC: నేడు రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరు..

Dc Vs Rr

Dc Vs Rr

Delhi Capitals Vs Rajasthan Royals:నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో రాజస్థాన్ రాయల్స్ మధ్య న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో రాజస్థాన్ అద్భుతంగా ఆడి పటిష్ట స్థితిలో ఉండగా.. అదే సమయంలో ఢిల్లీ కూడా ప్లే ఆఫ్‌ కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది.

Read Also: CM Revanth Reddy: నేడు వరంగల్‌ లో సీఎం రేవంత్‌ పర్యటన..

కాగా, ఈ సీజన్‌లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 6 స్థానంలో కొనసాగుతుంది. డీసీ రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ జట్టు మొత్తం రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చూస్తుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అయితే, చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోగా.. ఇప్పుడు, సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు ఢిల్లీపై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని చూస్తుంది.

Read Also: PM Modi: మూడో దశలో రికార్డు స్థాయిలో ఓటేయాలి.. ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి

ఇక, ఇప్పటి వరకు రెండు జట్లు మొత్తం 28 మ్యాచ్‌ల్లో పోటీపడగా..ఇఒ ఓఎఏఊ ఇందులో రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఉపరితలం స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. చిన్న గ్రౌండ్ కావడంతో బ్యాట్స్‌మెన్స్ దూకుడుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.. వేగంగా పరుగులు చేసే అవకాశం ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన చాలా జట్లు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

Exit mobile version