NTV Telugu Site icon

IPL 2023: నేడు కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ.. వార్నర్‌ సేన బోణీ కొట్టేనా?

Dc Vs Kkr

Dc Vs Kkr

IPL 2023: ఐపీఎల్‌-16లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు విజయాలు సాధించగా.. వార్నర్‌ సేన ఇప్పటివరకు బోణీ కూడా కొట్టలేదు.
వరుసగా 5 మ్యాచ్‌లో ఓడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీ జట్టు గెలుపు బాట పట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌లో వార్నర్‌ సేన ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ఢిల్లీ జట్టుకు ఓపెనర్‌ పృథ్వీ షా, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ పేలవ ఫామ్‌ సమస్యగా మారింది. కెప్టెన్‌ వార్నర్‌ నిలకడగానే ఆడుతున్నా వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఇక నోకియా, ముస్తాఫిజుర్‌, ముఖేశ్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ లాంటి వాళ్లతో కూడిన బౌలింగ్‌ విభాగం కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఈ కీలకమైన పోరులో ఎలా రాణిస్తుందో చూడాలి.

Read Also: Badri @23 years: పవన్ కల్యాణ్ నటించిన సెన్సేషనల్ హిట్ బద్రికి 23ఏళ్లు

5 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు అందుకునన కోల్‌కతాకు ఈ మ్యాచ్‌ గెలవడం అవసరమే.. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓడినా.. వెంకటేశ్‌ అయ్యర్‌ శతకం చేయడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక సారథి నితీశ్‌ రాణా, రింకు సింగ్‌, రసెల్‌తో ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. ఈ మ్యాచ్‌ కోసం గుర్బాజ్‌ స్థానంలో జేసన్‌ రాయ్‌ను ఆడించే అవకాశం ఉంది. బౌలర్లు కూడా రాణిస్తున్నారు.

ఢిల్లీ జట్టు: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (c), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (WK), లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్

కోల్‌కతా జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (wk),ఎన్‌. జగదీశన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (c), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ.