Delhi Capitals Team Visits GMR Engineering College: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం (మార్చి 31) విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం సోమవారం చెన్నై టీమ్ హైదరాబాద్ చేరుకోగా.. ఢిల్లీ జట్టు మాత్రం విజయనగరం జిల్లా రాజాంలో సందడి చేసింది. సోమవారం మధ్యాహ్నం రాజాంలోని జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలను ఢిల్లీ జట్టు సందర్శించింది. అక్కడి విద్యార్థులతో ప్లేయర్స్ మాట్లాడారు. వారికి బహుమతులు కూడా అందజేశారు.
Also Read: Lambasingi OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘లంబసింగి’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులు అక్షర్ పటేల్, ట్రిస్టాన్ స్టబ్స్, మిచెల్ మార్ష్, కుమార్ కుషాగ్ర, అభిషేక్ పోరెల్, స్వస్తిక్ చిక్రా, లలిత్ యాదవ్‌లు జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లారు. ఢిల్లీ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రికీ పాంటింగ్, సహాయ కోచ్ ప్రవీణ్ అమ్రె, సలహాదారు వేణుగోపాలరావు తదితరులు రెండు గంటలకు పైగా కళాశాలలో గడిపారు. విద్యార్థులను ఉద్దేశించి దాదా ప్రసంగించారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు వారు ప్రశంసాపత్రాలు అందజేశారు. దాదా ప్రసంగిస్తుండగా.. విద్యార్థు కేకలు వేశారు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయనగరం జిల్లా రాజాంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం సందడి. జిఎంఆర్ ఐటి క్యాంపస్ లో విద్యార్థులతో ముచ్చట్లు. స్టూడెంట్స్ చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని గంగూలీ పిలుపు. #AndhraPradesh#DelhiCapitals #Vizag #Visakhapatnam #IPL2024 pic.twitter.com/39FckEwGh2
— Vizag News Man (@VizagNewsman) April 2, 2024