Site icon NTV Telugu

RR vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. దంచికొడుతున్న యశస్వి

Ipl

Ipl

RR vs DC: ఐపీఎల్ 2023లో మరో కీలక పోరుకు గౌహతిలోని బర్సపరా క్రికెట్‌ స్టేడియం వేదికైంది. రాజస్థాన్‌ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతోంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇదిలా ఉండగా.. మొదటి ఓవరులోనే ఓపెనర్ ఐదు ఫోర్లు బాదాడు. ఒకే ఓవర్‌లో 20 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కాగా ఇరు జట్లు ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు చొప్పున మ్యాచ్‌లు ఆడారు. రాజస్థాన్‌ రాయల్స్ రెండింటిలో ఒక విజయాన్ని అందుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. దీంతో ముచ్చటగా మూడో మ్యాచ్‌లో బోణీ కొట్టాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఉవ్విళ్లూరుతోంది. ఇక రెండో విజయాన్ని సాధించి ముందుకు సాగాలని సంజూ శాంసన్ సారధ్యంలోని రాజస్థాన్ రాయల్స్ పట్టుదలతో ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాల్సిందే.

తుది జట్లు:

రాజస్థాన్ రాయల్స్: జాస్ బట్లర్, యషశ్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హెట్మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్.

ఢిల్లీ క్యాపిటల్స్‌: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, రిలీ రూసో, పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పొరెల్ (వికెట్ కీపర్), అన్రిచ్ నొర్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్.

Exit mobile version