Site icon NTV Telugu

Bouncer Death: స్టవ్‌ పక్కన నిద్రపోయి.. ప్రాణాలు కోల్పోయిన బౌన్సర్!

Burnt

Burnt

Delhi Bouncer Was Burnt To Death: చలికి తట్టుకోలేని ఓ వ్యక్తి ఇంట్లో బొగ్గుల కుంపటి పక్కనే నిద్రపోయి.. మంటల కారణంగా మృతి చెందాడు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఫతేపూర్ బెరీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీని చలి వణికిస్తోన్నా విషయం తెలిసిందే.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… అంగన్‌వారీ వలీ ప్రాంతంలో నివాసముంటున్న వైనీ అరోరా (36) బౌనర్స్‌గా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం తీవ్రంగా చలివేయడంతో.. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని తన గదిలో ఉన్న చిన్న బొగ్గుల స్టవ్‌లో నిప్పు ఏర్పాటు చేసుకున్నాడు. అరోరా చలి కాచుకుంటూ.. అలాగే నేలపై నిద్రపోయాడు. ప్రమాదవశాత్తు బొగ్గులు ఎక్కువగా మండడంతో.. ఆ మంటలు అరోరా దుస్తులకు అంటుకున్నాయి. దాంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: SA vs IND: ఆ వ్యూహం పెద్ద తప్పిదం.. రోహిత్ శర్మ అలా చేయాల్సింది కాదు!

స్థానికులు సమాచారం అందించగా ఫతేపూర్ బెరీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైనీ అరోరా గది లోపలి వైపు నుంచి గడియ పెట్టి ఉండడంతో పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అరోరా నేలపై పడి కాలిపోయినట్లు ఉన్నాడు. రూంలోని మరికొన్ని వస్తువులు కూడా కాలిపోయాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version