Anantnag Arrest NIA: ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన కార్ బాంబు పేలుడు కేసులో NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) ఒక పెద్ద పురోగతిని సాధించింది. ఢిల్లీ పేలుడుకు సంబంధం ఉన్న మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన వ్యక్తి అమీర్ రషీద్ అలీని ఆదివారం NIA అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వానిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది. సూసైడ్ బాంబర్ ఉమర్‌కు కారు బాంబును ఇచ్చింది బిలాల్ అని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. జసీర్ బిలాల్ డ్రోన్లు, రాకెట్ల ద్వారా దాడికి ప్లాన్ చేసినట్లు తెలిపారు. అనంతనాగ్‌లో నిందితుడు జసీర్ బిలాల్ వానిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.
READ ALSO: Ganja Batch: పోలీసుల నిర్లక్ష్యం.. విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్..!
పేలుడులో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలను, వారి కుట్రలను గుర్తించడానికి దర్యాప్తు సంస్థ ఇప్పుడు ముమ్మర దర్యాప్తు చేస్తుంది. నవంబర్ 10న ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారితో సహా ఇప్పటివరకు 73 మంది సాక్షులను ఈ ఏజెన్సీ ప్రశ్నించింది. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఇతర ఏజెన్సీల సహకారంతో NIA ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. కేసును కేసు నంబర్ RC-21/2025/NIA/DLI కింద నమోదు చేశారు. ఢిల్లీ పేలుడుకు ఉపయోగించిన కారు అమీర్ రషీద్ అలీని పేరు మీద రిజిస్టర్ అయినట్లు NIA అధికారులు తెలిపారు. ఇప్పటికే అతన్ని ఆదివారం ఢిల్లీలో అరెస్టు చేశారు.
