Delhi Exit Polls : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం EVMలో నిక్షిప్తం అయింది. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8 న విడుదల కానున్నాయి. కానీ దీనికి ముందు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. అతిషి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013, 2015, 2020లలో ఆప్ వరుసగా గెలిచింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ చిక్కుకుని 2024 మార్చిలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సెప్టెంబరులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీ అతిషిని కొత్త ముఖ్యమంత్రిగా చేసింది.
ఈ ఎన్నికలు ఆప్ కు చాలా ముఖ్యమైనవి. బిజెపి, కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నాయి. తిరిగి అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 1993లో ఢిల్లీలో బిజెపి గెలిచింది. కానీ ఆ తర్వాత ఎప్పుడూ విజయం సాధించలేదు. 1998, 2003, 2008లలో కాంగ్రెస్ వరుసగా గెలిచింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈసారి ఎన్నికల్లో ఆప్ బిజెపి, కాంగ్రెస్ ల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఢిల్లీలో దాదాపు 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
Read Also:Tollywood: 1000 కోట్ల సినిమాకి..ప్రొడ్యూసర్ కు వచ్చేదెంత?
ఎగ్జిట్ పోల్ సర్వే ఎలా ఉన్నాయంటే ?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ తొలి సంఖ్య వెలువడింది. MATRIZE ప్రకారం.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 32 నుంచి 37 సీట్లు వస్తాయని, బీజేపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని అంచనా. ఇది కాకుండా, కాంగ్రెస్ ఖాతాను కూడా తెరవవచ్చు.
పీపుల్స్‌పల్స్-కొడిమో
బీజేపీ-51-60
ఆప్- 10-19
కాంగ్రెస్-0
ఇతరులు-0
టైమ్స్ నౌ
బీజేపీ-39-45
ఆప్-29-31
కాంగ్రెస్-0-2
ఏబీపీ-మ్యాట్రిజ్
బీజేపీ- 35-40
ఆప్ – 32-37
కాంగ్రెస్- 0-1
రిపబ్లిపకన్ మార్క్
బీజేపీ 39-41
ఆప్ 21-31
చాణక్య
బీజేపీ-39-44
ఆప్-25-28
Read Also:Madhya Pradesh : బిచ్చగాడికి బిచ్చం వేయడం కూడా తప్పేనా.. రూ.10 వేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు
ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన మార్గదర్శకాలు ఏమిటి?
భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలు 1998లో జారీ చేయబడ్డాయి. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, అన్ని దశల ఓటింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్‌ను చూపించకూడదు. చివరి దశ ఓటింగ్ ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూపవచ్చు. -చట్టం ప్రకారం, ఎవరైనా ఎన్నికల ప్రక్రియలో ఎగ్జిట్ పోల్స్ లేదా ఎన్నికలకు సంబంధించిన ఏదైనా సర్వేను చూపిస్తే లేదా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే, వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.