Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున ఒక పెద్ద ప్రమాదం తప్పింది. SWISS ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో వెంటనే టేకాఫ్‌ను నిలిపివేశారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు.
అందిన వివరాల ప్రకారం, LX147 ఫ్లైట్ (ఎయిర్‌బస్ A330) ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్‌కు బయల్దేరాల్సి ఉంది. రాత్రి 1.08 గంటల సమయంలో విమానం టేకాఫ్ రన్ ప్రారంభించగా.. ఒక్కసారిగా ఓ ఇంజిన్‌లో లోపం ఏర్పడి మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన పైలట్లు వెంటనే టేకాఫ్ ను రద్దు చేసి అత్యవసర చర్యలు చేపట్టారు. ఈ విమానంలో మొత్తం 228 మంది ప్రయాణికులు, నలుగురు శిశువులు ఉన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ ఘటనతో వీరందరిని సిబ్బంది అత్యవసర స్లైడ్స్ ద్వారా ప్రయాణికులను రన్‌వేపైకి సురక్షితంగా తరలించారు. కొంతమంది ప్రయాణికులు స్లైడ్స్ ఉపయోగించలేకపోవడంతో వారికి మెట్ల ద్వారా బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రక్రియలో ఆరుగురు ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
ఘటన అనంతరం ఎయిర్‌లైన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు అవసరమైన సహాయం అందిస్తూ, హోటల్ వసతి, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన సాంకేతిక లోపాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి SWISS సంస్థ నిపుణుల బృందాన్ని ఢిల్లీకి పంపుతోంది.
Hindistan’ın başkenti Delhi’de bulunan Indira Gandhi Uluslararası Havalimanı’nda Swiss’e ait bir yolcu uçağı kalkış sırasında motor arızası nedeniyle alev aldı.https://t.co/vtVMHmKFW4 pic.twitter.com/VyuB02bE7Q
— herdem_aviation (@muratherdemm) April 26, 2026
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..