Notice To Danam Nagender: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగం పెంచారు. ఇందుకు సంబంధించి తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
MS Dhoni: అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఐపీఎల్ 2028లో కూడా ఎంఎస్ ధోనీ!
ఈ నెల 30వ తేదీన ఉదయం స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని దానం నాగేందర్‌ను ఆదేశించారు. అదేవిధంగా ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. ఇందులో భాగంగా ఉదయం 10:30 గంటలకు బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుండగా.. మధ్యాహ్నం 12:00 గంటలకు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుంది.
ఎమ్మెల్యేల అనర్హత అంశంలో జాప్యం జరుగుతోందని భావించిన సుప్రీంకోర్టు ఈ నెల 19న స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చర్యలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో, స్పీకర్ పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల (దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్) అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అరికపూడి గాంధీ సహా మరో ఏడుగురికి ‘క్లీన్ చిట్’ లభించిన సంగతి తెలిసిందే.
Today My Last Day.. ఇంటర్ విద్యార్థి ఎమోషనల్ పోస్ట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
అయితే మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే దానం నాగేందర్ కేసు భిన్నమైనది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బి-ఫామ్‌పై ఎంపీగా పోటీ చేశారు. ఇది స్పష్టమైన ఫిరాయింపు కిందకు వస్తుందని.. అందుకే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే, దానం తన ఎమ్మెల్యే పదవిని కోల్పోతారు. మరోవైపు స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే.. దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు (By-elections) వెళ్తారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది. మొత్తానికి 30వ తేదీన జరిగే విచారణ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసేలా కనిపిస్తోంది.
