రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ నోటిసుల్లో పేర్కొనింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆశోక్ గెహ్లాట్‌పై వేసిన పరువు నష్టం దావా ఆధారంగా ఈ నోటీసులను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జారీ చేసింది. సుమారు 900 కోట్ల రూపాయలకు సంబంధించి ఆశోక్ గెహ్లాట్ చేసిన ఆరోపణలకు గానూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ పిటిషన్ వేశారు.
సంజీవని స్కామ్‌పై చేసిన వ్యాఖ్యలతో రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ తన పరువు తీశారంటూ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కోర్టుకెక్కారు. అయితే.. నేరపూరిత పరువు నష్టం కేసులో ముఖ్యమంత్రికి నోటీసులు పంపాలా? వద్దా? అని తర్జనభర్జనలు చేసి.. ఆ ఉత్తర్వులను ఇదివరకే కోర్టు రిజర్వ్ చేసింది. ఇక ఇవాళ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ హజ్రీత్ సింగ్ జస్పాల్ ఇవాళ సీఎం ఆశోక్ గెహ్లాట్‌కు నోటీసులను జారీ చేశారు.
Also Read: Tillu Square: పాపం… ఏ డేట్ అనౌన్స్ చేసినా వాళ్లు వదలడం లేదుగా!
ఇంతకు ముందు మోడీ ఇంటి పేరు వ్యవహారంలో పరువు నష్టం దావా ద్వారా కోర్టు కేసు ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దోషిగా తేలి రెండేళ్ల శిక్ష పడడంతో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయాడు. మరీ ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ చేసిన దానికి ఎలాంటి శిక్ష పడుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
