NTV Telugu Site icon

INDWvsWIW: దీప్తి శర్మ తీన్మార్.. వెస్టిండీస్ 118/6

11

11

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతోన్న మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్‌లో తడబడింది. ఓపెనర్ స్టెఫానీ టేలర్ (42)కు తోడు క్యాంప్‌బెల్ (30) ఆదుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. దీంతో టీమిండియా ముందు 119 టార్గెట్ ఉంచింది విండీస్. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లతో అదరగొట్టగా.. పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ చెరో ఒక వికెట్ దక్కించుకున్నారు.

Also Read: Laya Gorty: హీరోయిన్ లయ కూతురును చూశారా.. అచ్చుగుద్దినట్లు తల్లిని దింపేసింది

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ మాథ్యూస్ (2)ను పూజా వస్త్రాకర్ బోల్తా కొట్టించింది. అనంతరం టేలర్, క్యాంప్‌బెల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేశారు. వికెట్ కోసం కెప్టెన్ హర్మన్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఈ జోడీ తమ హాఫ్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్ పూర్తి చేసుకుంది. అయితే కాసేపటికే వీరిద్దరినీ ఒకే ఓవర్లో ఔట్ చేసింది దీప్తి శర్మ. 14వ ఓవర్ మూడో బంతికి క్యాంప్‌బెల్, చివరి బంతికి టేలర్‌ను ఔట్ చేసి టీమిండియా క్యాంప్‌లో ఆనందం నింపింది. దీంతో రెండో వికెట్‌కు 73 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా చివర్లో హెన్రీ (2) విఫలమైనా నేషన్ (21 నాటౌట్), గజ్నబీ (15) కాసేపు పోరాడటంతో విండీస్ ఓ మోస్తారు స్కోర్ చేసింది.

Also Read: Oyo Bookings: ఓయోలో రికార్డు బుకింగ్స్.. వాలెంటైన్స్ డే పుణ్యమా అని!