Site icon NTV Telugu

Deepika Padukone: ఆడవారి కంటే మగవారి స్టామినా చాలా తక్కువ.. రెచ్చిపోయిన దీపిక..!

Deepika Padukone

Deepika Padukone

Deepika Padukone: ఓం శాంతి ఓం సినిమాలో ఫస్ట్ టైం బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సరసన నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయారు దీపికా పదుకోనే. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గోల్డెన్ బ్యూటీ అనిపించుకున్నారు. ప్రస్తుతం ఆమె గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఈమె ఇప్పుడు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. ఇక తాజాగా తెలుగులో ప్రాజెక్ట్ కే అనే చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అగ్ర తారగా ఒక వెలుగు వెలిగిన ఈమె పెళ్లి తర్వాత ఈ మధ్య ఆ స్థాయి అవకాశాలు దక్కించుకోలేకపపోయింది. ప్రముఖ బాలీవుడ్ హీరో రన్ వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతానికి ఈ జంటకు ఇంకా పిల్లలు కలగలేదు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో తరచూ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ కాంట్రవర్సీలలో చిక్కుకుంటుంది.

Read Also:Different Weather: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితి.. ఎండలు.. వానలు..

ప్రస్తుతం ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీపిక. తాజాగా ఒక ఇంగ్లీష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మగవాళ్ల స్టామినా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సెక్స్ లైఫ్ వ్యక్తిగత జీవితాల గురించి బోల్డ్ కామెంట్లు చేసిన దీపిక మాటలను విన్న ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. ఇకపోతే ఆ విషయంలో మగవారు మ్యాగీ కంటే చీప్.. ఆడవారితో పోల్చుకుంటే వారికి స్టామినా చాలా తక్కువగా ఉంటుంది అంటూ పచ్చిగా.. మరింత బోల్డ్ గా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది దీపిక. ఇప్పుడు ఈ మాటలు విన్న వారు నోరెళ్ళ పెడుతున్నారు. అసలు మగాళ్ళ గురించి దీపిక ఎందుకు ఇలాంటి కామెంట్లు చేసింది అని అభిమానుల సైతం ఆరా తీస్తున్నారు.

Read Also:Adivi Sesh: నాగార్జున మేనకోడలిని పెళ్లి చేసుకోబోతున్న అడివి శేష్ ?

Exit mobile version