బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడింది. ‘ఓం శాంతి ఓం’తో గ్రాండ్ డెబ్యూ చేసి, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘పద్మావత్’, ‘పఠాన్’, ‘కల్కి 2898 ఏడి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఆమె కొన్ని సందర్భాల్లో కథల ఎంపికలో తప్పులు జరిగాయని బాధను వ్యక్తం చేసింది. దీపికా మాట్లాడుతూ..
Also Read : Akhanda 2: ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని అతిథులా? – సినీ వర్గాల్లో హాట్ టాక్!
“కొన్నిసార్లు నా పాత సినిమాలు గుర్తుకు వస్తే నిజంగా బాధేస్తుంది. ఎంచుకున్న కొన్ని స్క్రిప్టులు నాకు ఇబ్బందులు తీసుకువచ్చాయి. నేను చేసిన ప్రతి సినిమా సక్సెస్ కాలేదు కొన్ని మాత్రం పూర్తిగా నిరాశపరిచాయి” అని స్పష్టం చేసింది. డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేస్తుందని కొందరు భావిస్తారన్న దానిపై కూడా ఆమె స్పందిస్తూ.. “అది నిజం కాదు. సినిమాలు పెద్దవో చిన్నవో, వాణిజ్యపరంగా హిట్‌గా మారతాయో లేదో వాటి కంటే నేను స్క్రిప్ట్‌లోని వ్యక్తులను, అందులోని భావాన్ని నమ్ముతాను. వాళ్ల కథను నిజాయితీగా చేయాలనిపిస్తే అంగీకరిస్తాను” అని చెప్పింది. గతంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో క్లారిటీ తక్కువగా ఉండేదని చెప్పిన దీపిక.. “ఇప్పుడు మాత్రం ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తాను. కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ‘అప్పుడు నేను ఎలాంటి తప్పులు చేశానా ?’ అనిపిస్తుంది. ఇలాంటివన్ని నేర్చుకునే ప్రక్రియలో భాగమే. బహుశా వచ్చే పదేళ్ల తర్వాత ఇప్పుడు చేస్తున్న సినిమాల గురించి కూడా ఇలానే అనిపించవచ్చు” అని తెలిపింది.
