NTV Telugu Site icon

Kalki 2898 AD: డబ్బింగ్‌ పూర్తి.. సినిమాలకు దీపికా పదుకొనే గ్యాప్‌!

Deepika Padukone

Deepika Padukone

Deepika Padukone Plan to Take Rest after Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్ అశ్వత్థామగా నటిస్తుండగా.. విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. పశుపతి, దిశా పటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Also Read: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు

‘కల్కి 2898 ఏడీ’లో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్‌ని దీపికా పదుకొనే తాజాగా పూర్తి చేశారట. హిందీ, కన్నడ భాషల్లో డబ్బింగ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపిక గర్భవతి. దీంతో సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి.. జూన్‌ నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమై రెస్ట్ తీసుకోనుకుంటున్నారట. అందుకే కల్కి 2898 ఏడీలో తన పాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేశారట. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌.. ఇలా పలు భాషల్లో రిలీజ్ కానుంది. అయితే హిందీ, కన్నడ వెర్షన్లకు మాత్రమే దీపికా డబ్బింగ్‌ చెప్పారు. ఇతర భాషల్లో వేరేవారితో డబ్బింగ్‌ చెప్పిస్తారా? లేదా దీపికానే చెబుతారా? అన్నది ఇంకా తెలియరాలేదు.

Show comments