NTV Telugu Site icon

Archery World Cup 2024: ఆర్చ‌రీ ప్ర‌పంచ‌క‌ప్‭లో ర‌జ‌తంతో సరిపెట్టుకున్న దీపికా కుమారి

Archer Deepika

Archer Deepika

Archery World Cup 2024 DEEPIKA KUMARI Won Silver medal: మెక్సికోలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో చైనాకు చెందిన లీ జియామెన్ చేతిలో 0-6 తేడాతో ఓడిపోయిన తర్వాత భారత టాప్ రికర్వ్ ఆర్చర్ దీపికా కుమారి రజత పతకాన్ని గెలుచుకుంది. సెమీఫైనల్స్ వరకు ఆమె మంచి ప్రదర్శన కనబరిచింది. కానీ, పారిస్ ఒలింపిక్స్ జట్టు రజత పతక విజేత నాల్గవ సీడ్ లీ జియామెన్ పై జరిగిన బంగారు పతకం మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడికి గురైందని తెలుస్తోంది. ఇకపోతే ఇది దీపికకు తొమ్మిదవ ప్రపంచ కప్ ఫైనల్. ఆర్చరీ ప్రపంచకప్‌లో దీపికా కుమార్ రన్నరప్‌గా నిలవడం ఇది ఐదోసారి. అంటే దీపిక ఐదు రజత పతకాలు, ఒకసారి కాంస్య పతకాన్ని గెలుచుకున్నప్పటికీ ఆర్చరీ ప్రపంచకప్‌ను ఇంకా గెలవలేకపోయింది.

Read Also: Charles III: బ్రిటన్‌ రాజుకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఘోర అవమానం.. నువ్వు మాకు రాజువి కాదంటూ..

ఆర్చ‌రీ ప్రపంచ కప్ ఫైనల్లో బంగారు పతకం సాధించిన ఏకైక భారతీయ మహిళా డోలా బెనర్జీ. ఈమె 2007లో దుబాయ్లో జరిగిన పోడియంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇకపోతే 2022లో దీపిక‌కు కూతురు జ‌న్మించింది. దాదాపు మూడేళ్ల తర్వాత అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కు చేరుకుంది. ఇక మరోవైపు పురుషుల రిక‌ర్వ్ విభాగంలో తెలుగు తేజం ధీర‌జ్ బొమ్మ‌దేవ‌ర ఓటమిని చవి చూసాడు. పారిస్ ఒలంపిక్స్ కాంస్య పతక విజేత, దక్షిణ కొరియా ఆర్చర్ లీ వూ సియోక్ చేతిలో 4-2 తేడాతో ధీరజ్ ఓట‌మి పాలయ్యాడు.

Read Also: Khalistani Terrorist: నవంబర్ 19 వరకు ఎయిరిండియాలో ప్రయాణించొద్దు.. ఖలిస్తానీ టెర్రరిస్ట్ వార్నింగ్

Show comments