Moon A Hindu Rashtra: చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి విజయం సాధించిన ఇస్రో.. చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాలపై అధ్యయయాన్ని మొదలు పెట్టింది.. మరోవైపు.. చంద్రయాన్ -3 సక్సెస్‌ను పురస్కరించుకుని శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ప్రధాని మోడీ.. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ.. శనివారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్లి చంద్రయాన్ -3 విజయంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్ -3లోని విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని పేరు పెట్టాలని సూచించారు. ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటామని కూడా ప్రకటించారు ప్రధాని మోడీ.. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.
Read Also: Rangareddy: నా భార్యను అలా చేశాడు అందుకే చంపేశా..! మైనర్ బాలుడి హత్య కేసులో ట్విస్ట్..
విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన శివశక్తి పాయింట్ రాజధానిగా చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తు్నారు అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి.. దీనిపై పార్లమెంట్ ఓ ప్రకటన చేయాలని, ఐక్యరాజ్యసమితి కూడా తీర్మానం చేయాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారాయన. అంతేకాదు.. జిహాదీ భావజాలం కలిగిన వ్యక్తులు చంద్రుడిపైకి వెళ్లకముందే, చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటిస్తూ.. భారత పార్లమెంట్ తీర్మానం చేయాలని సూచించిన ఆయన.. ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి సైతం దీనిపై ఓ ప్రకటన చేయాలని కోరారు. మరోవైపు.. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్‌గా నామకరణం చేసినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు స్వామి చక్రపాణి.. చంద్రుడ్ని హిందూ సనాతన దేశంగా ప్రకటించాలి.. ల్యాండింగ్ ప్రాంతం ‘శివశక్తి పాయింట్’ను రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆకాక్షించారు.. అయితే, దీనికి సంబంధించిన కామెంట్లు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.. ఇస్రో విజయం సాధిస్తే.. ఇలాంటి వారి వాల్ల వారి పరువు కూడా పోయే పరిస్థితి వచ్చిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి ఐడియాలు అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
