2026 చివరి నెలైన డిసెంబర్ జ్యోతిష్య పరంగా చాలా స్పెషల్గా ఉండబోతోంది. ఈ నెలలో గ్రహాల రాజు సూర్యుడు వరుసగా నక్షత్రాలను మారుస్తూ 12 రాశులపై ప్రభావం చూపనున్నాడు. డిసెంబర్ 4న వృశ్చిక రాశిలోని అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించే సూర్యుడు, డిసెంబర్ 13న జ్యేష్ఠ నక్షత్రంలోకి, డిసెంబర్ 22న మూల నక్షత్రంలోకి మారుతాడు. చివరగా డిసెంబర్ 30న ధనుస్సు రాశిలోని పూర్వాషాఢ నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ నక్షత్ర మార్పులతో కొన్ని రాశులకు ఆకస్మిక ధనలాభం, సంపద, సౌకర్యాలు కలిసి వచ్చే ఛాన్స్ ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మిథునం, సింహ రాశులకు కలసి వచ్చే కాలం
డిసెంబర్ నెల మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబం, వృత్తిలో ఉన్న అనవసర గొడవలు తగ్గి, మాటల్లో మాధుర్యం, మితత్వం పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక స్థితి బలపడుతుంది, స్నేహితులు, కుటుంబ సభ్యుల సపోర్ట్ దొరుకుతుంది. అయితే పని, ఆరోగ్యం విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు సింహ రాశి వారికి సూర్యుడి ప్రభావంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆఫీసులో శత్రువులు కూడా మిత్రులుగా మారే ఛాన్స్ ఉంది. పని ఒత్తిడి తగ్గి, సెల్ఫ్ వర్క్ చేసే వారికి రెట్టింపు లాభాలు వస్తాయి. దేశ విదేశాల్లో పనిచేయాలనే, బిజినెస్ చేయాలనే కల నెరవేరే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరిగినా, ప్రశాంతంగా ప్లాన్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే మంచి విజయం అందుతుంది.
మకర, కర్కాటక రాశులకు శుభ మార్పులు
మకర రాశి వారికి డిసెంబర్లో కుటుంబ, ఆరోగ్య సమస్యలు తీరే సూచనలు ఉన్నాయి. ఆస్తి తగాదాలు, బంధువుల వల్ల వచ్చే మానసిక ఇబ్బందులు తగ్గి, ఓపికతో ముందుకు వెళ్తే కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఆదివారాల్లో సూర్యుడిని పూజించడం, గాయత్రీ మంత్రం జపించడం, పేదలకు నిత్యావసరాలు దానం చేయడం మంచిదని చెబుతున్నారు. ఇక కర్కాటక రాశి వారికి ఈ నెల అనుకున్న విధంగా సాగే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు రావడంతో పాటు మాట, చేతల్లో స్పష్టత వస్తుంది. కుటుంబ, ప్రేమ జీవితాల్లోని అపార్థాలు తొలగిపోతాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకుని స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడులు పెడితే కొందరికి భారీ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది.
తులారాశికి ఆదాయం.. జాగ్రత్తలు తప్పనిసరి
డిసెంబర్లో తులారాశి వారికి ఆదాయ మార్గాలు పెరిగి, పాత అప్పులు తీరే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడటంతో పాటు డ్రైవర్లు, పోలీసులు, లాయర్లు వంటి రంగాల వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అయితే కొన్ని విషయాలు మనసును కలవరపెట్టి ఒత్తిడి కలిగించే ఛాన్స్ ఉన్నందున మాట, చేతల్లో సంయమనం పాటించాలి. పెద్ద, రిస్క్ ఉండే నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ పెద్దల సలహాతో ముందుకు వెళ్లడం, తమతో పాటు కుటుంబ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టడం మంచిది.

