Deccan Mall Fire : సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. నిన్నటి నుంచి ఆచూకీ లభించని వ్యక్తులు సజీవ దహనమయ్యారు. బిల్డింగులో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. బిల్డింగ్ వెనుక భాగంలో గుర్తు పట్టలేని విధంగా మృతదేహాలు బూడిదయ్యాయి. వీటిని డ్రోన్ కెమెరా సాయంతో కనిపెట్టారు అధికారులు. మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దంతాలు తప్ప మరేమి దొరికే అవకాశం లేదంటున్నారు అధికారులు. ప్రమాదంలో వసీం, జునైద్, జహీర్ మిస్ అయ్యారు. మృతులు బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు అధికారులు. కాగా, డెక్కన్ మాల్ ప్రమాదం నుంచి బయటపడ్డ కూలీలను విచారణకు పిలిచారు రాంగోపాల్ పేట స్టేషన్ పోలీసులు. ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.
Read Also: Mans Belly Dance : ఏందిరయ్యా ఈ అరాచకం.. ఏదేమైనా సూపర్
భవనంలో గల్లంతు అయిన కూలీల ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది.. పోలీసులు సహాయక చర్యలు కొనసాగించారు. మంటల్లో చిక్కుకున్న కూలీల ఆచూకీ కోసం భారీ క్రేన్ సాయంతో బయట నుంచి భవనంలోని పై అంతస్తుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. సుమారు 12 గంటల పాటు విపరీతంగా మండిన మంటల వల్ల భవనం పూర్తిగా దెబ్బతిన్నందున గాలింపు పూర్తయ్యాక భవనం మొత్తాన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక మంటల ధాటికి ఆరు అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. అయితే.. భవనంలో 12 గంటలకు పైనే భారీ అగ్నికీలలు లోపలికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక అగ్నిప్రమాద సహాయ చర్యల్లో పాల్గొని అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: Ex-Husband Crime: మరో వ్యక్తితో మహిళ రాసలీలలు.. తట్టుకోలేక భర్త కిరాతక పని