NTV Telugu Site icon

Abu Dhabi T10 Final: మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్..

Abu Dhabi T10 Final

Abu Dhabi T10 Final

అబుదాబి T10 లీగ్ ఫైనల్ మ్యాచ్‌ మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీ-డెక్కన్ గ్లాడియేటర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు కోల్పోయి డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం సాధించింది. డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టు 6.5 ఓవర్లలో 105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో.. డెక్కన్ గ్లాడియేటర్స్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అబుదాబి టీ-10 లీగ్ టైటిల్‌ను మూడోసారి గెలుచుకున్న తొలి జట్టుగా నిలిచింది. అంతకుముందు 2021, 2022లో ఈ జట్టు టైటిల్‌ను గెలుచుకుంది.

Read Also: YS Jagan: రేపు జగన్‌ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం..

డెక్కన్ గ్లాడియేటర్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మోరిస్‌విల్లే సంప్ ఆర్మీ జట్టు 104 పరుగులు చేసింది. ఈ జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆండ్రిస్ గౌస్ 21, కరీం జనత్ 16, చరిత్ అసలంక 13 పరుగులు చేశారు. డెక్కన్ గ్లాడియేటర్స్ బౌలింగ్‌లో రిచర్డ్ గ్లీసన్ 2 వికెట్లు పడగొట్టాడు. మహీష్ తీక్షణ, అన్రిచ్ నోర్ట్జే, ఉస్మాన్ తరీఖ్, ఇబ్రార్ అహ్మద్ తలో వికెట్ సంపాదించారు.

Read Also: IND vs AUS: అడిలైడ్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..!

105 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెక్కన్ గ్లాడియేటర్స్.. కోహ్లర్-కాడ్మోర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ 28 పరుగులతో రాణించాడు. రిలే రోసౌవ్ 12 పరుగులు, జోస్ బట్లర్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో డెక్కర్ గ్లాడియేటర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీ బౌలింగ్‌లో ఇసురు ఉదాన, అమీర్ హంజా తలో వికెట్ తీశారు.

Show comments