NTV Telugu Site icon

Toxic Alcohol: తమిళనాడులో 47కు చేరిన కల్తీ సారా మృతుల సంఖ్య.. విపక్షాలు ఫైర్

Tamilnadu

Tamilnadu

Toxic Alcohol: తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరుణాపురంలో నాటు సారా ఘటనలో ఇవాళ్టి వరకు మృతి చెందిన వారి సంఖ్య 47కు చేరుకుందని తమిళనాడు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంగుమణి పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సుమారు 109 మంది బాధితులు జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కల్తీ సారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు ఫెయిల్ అవుతుండటంతో నిపుణులైన వైద్యులను తమినాడు సర్కార్ రంగంలోకి దించింది.

Read Also: CM Revanth Reddy: పోచారం మాకు అండగా నిలవడటానికి ముందుకు వచ్చారు..

ఇక, విళుపురం, సేలం తిరుచ్చి, తిరువణ్ణామలై జిల్లాల్లోని వైద్య కళాశాలల వైద్యులను తరలించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే, మరోవైపు కళ్లకురిచ్చి ఘటనకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరనసలు తెలిపారు. ఇక, నిరసన తెలిసన ఎమ్మెల్యేలను పోలీసులు అక్కడి నుంచి తరలించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. హూచ్‌ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని అన్నాడీఎంకే శ్రేణులు డిమాండ్‌ చేశారు. జూన్‌ 24న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామి వెల్లడించారు.