Chicken : భూమ్మీద నూకలుంటే ఎంత ప్రయత్నించినా చావనేది దక్కరకు రాదని పెద్దలు అంటుంటారు. మాంసాన్ని విక్రయించడానికి దాని యజమాని వధించిన కోడి విషయంలో కూడా అలాంటిదే జరిగింది. అది తల లేకుండా కూడా కొన్ని నెలలపాటు బతికే ఉంది. ఇది వినడానికి ఇది ఒక అద్భుతంగా అనిపిస్తుంది కదూ.. ఈ వింత మరణం చాలా చర్చనీయాంశమైంది.
కోడి మాంసం అంటే చాలా మందికి ఇష్టం. ముక్కలేనిదే ముద్ద గొంతులోకి దిగని వారున్నారు. అలా వంటకం కోసం చంపేందుకు ప్రయత్నించిన కోడి గురించి తెలుసుకుందాం. అది ఎలా జరిగిందో తెలియదు కానీ దాని తల తెగిపోయినా కూడా చావకుండా ఇతర చనిపోయిన కోళ్ల మధ్య కాళ్లతో నేలను దున్నుతోంది. ఈ దృశ్యం చూసి దాని యజమాని కూడా చలించిపోయాడు. కథ ఇంతటితో ముగియలేదు.
Read Also:YV Subba Reddy: ఎన్నికల్లో పోటీ.. మార్పులు, చేర్పులపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు..
తల లేకుండా 18నెలలు బతికిన కోడి
ఈ కేసు అమెరికాలోని కొలరాడోకి చెందినది. ఇక్కడ లాయిడ్ ఒల్సెన్, క్లారా అనే జంట నివసించారు. ఒకసారి అతను మాంసం కోసం మొత్తం 50 కోళ్లను చంపాడు. కానీ వాటిలో ఒకటి తల నరికినా సజీవంగా, చురుకుగా ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. అతను ఈ తల లేని కోడిని రాత్రిపూట ఆపిల్ బాక్స్‌లో ఉంచాడు. ఆ సమయంలో కచ్చితంగా చనిపోయిందని భావించాడు. మరుసటి రోజు వారు పెట్టెను తెరిచినప్పుడు అది ఇంకా బతికే ఉంది. ఆ కోడి ఏకంగా 18 నెలల పాటు తల లేకుండా జీవించింది. ఆ వ్యక్తి బతికి ఉన్న కోడిపై స్లైడ్‌షో చేసి డబ్బు సంపాదించాడు.
Read Also:Facebook Page Hack: మంత్రి దామోదర మెసేజ్ చేస్తే.. రిప్లై ఇవ్వకండి..!
ఈ సంఘటన సెప్టెంబర్ 10, 1945 న జరిగింది. దీని గురించి ఈ జంట మనవడు మాట్లాడాడు. ఆ సమయంలో లైఫ్ మ్యాగజైన్ కూడా ఈ తల లేని కోడిపై కథను రూపొందించింది. దానికి మైక్ అని పేరు పెట్టారు. ఒల్సేన్ దంపతులు కోడిని చూపించడానికి చాలా ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఈ టూర్ ద్వారా వారికి డబ్బు కూడా వచ్చింది. ఇది మొత్తం 18 నెలల పాటు కొనసాగింది. చివరకు 1947లో అరిజోనా పర్యటనలో కోడి మరణించింది. అసలే తల లేకపోవడంతో భార్యాభర్తలు నేరుగా ఫుడ్‌పైప్ ద్వారా ఇచ్చేవారు. ఒకరోజు కోడికి ఆహారం గొంతులో ఇరుక్కుపోయి చనిపోయింది. ఎన్నో నెలలపాటు తల లేకుండా బతికిన ఆత్మవిశ్వాసం చరిత్రలో ఇదొక అపూర్వ సంఘటన.