Site icon NTV Telugu

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సుమయా రెడ్డి ‘డియర్ ఉమ’

Dear Uma

Dear Uma

సుమయా రెడ్డి నిర్మాతగా, హీరోయిన్‌గా, రచయితగా చేసిన చిత్రం ‘డియర్ ఉమ’. సమాజాన్ని మేల్కోపే ఓ కథతో సుమయా రెడ్డి చేసిన ఈ మొదటి ప్రయత్నం థియేటర్లో అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మక చిత్రంగా ‘డియర్ ఉమ’ నిలిచింది. నటిగా, నిర్మాతగా, కథా రచయితగా సుమయా రెడ్డికి మంచి పేరు వచ్చింది. థియేటర్లలో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు సన్ NXT లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలో మరింత ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.

సుమయా రెడ్డి తన సొంత బ్యానర్ అయిన సుమ చిత్ర ఆర్ట్స్‌పై రచయిత, నిర్మాతగా ‘డియర్ ఉమ’ నిర్మించింది. ఆమె సరసన పృథ్వీ అంబర్ నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీకి సుయమా రెడ్డి స్క్రీన్ ప్లే, సంభాషణలు కూడా రాశారు. కార్పొరేట్ రంగం, వైద్య రంగంలో లోపాలను ఎత్తి చూపుతూ తీసిన ఈ ‘డియర్ ఉమ’ ప్రస్తుతం అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. సుమయా రెడ్డి నటన, ప్రజెన్స్, పృథ్వీ అంబర్ పోషించిన పాత్ర ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను మెప్పించాయి. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, రాజ్ తోట సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. రధన్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సన్ నెక్ట్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Exit mobile version