NTV Telugu Site icon

DCP Vineeth : బెంగుళూరులో గ్రాడ్యుయేట్.. డబ్బుల కోసం హైదరాబాద్‌లో ఆ పని చేస్తున్న యువతి

Madhapur Dcp Vineet

Madhapur Dcp Vineet

DCP Vineeth : అంతరాష్ట్ర మహిళ డ్రగ్ పెడ్లర్ ను TGANB, సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్ కు చెందిన శతాబ్ది మన్నా ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద 6 లక్షల రూపాయల విలువ చేసే 60 గ్రాముల MDMA డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఆఫ్రికా కు చెందిన వారెన్ కొకరంగో పరారీ ఉన్నాడు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న TGNAB, మియాపూర్ పోలీసులు సోదాలు చేశారని, బెంగళూర్ నుండి వచ్చిన మహిళ శతాబ్ది మన్నా (24) వద్ద 60 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

APERC: విద్యుత్ ఛార్జీల టారిఫ్ విడుదల చేసిన ఏపీఈఆర్సీ.. వారికి గుడ్‌న్యూస్‌..
డ్రగ్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు ఆఫ్రికా కు చెందిన వారెన్ కొకరంగో పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు. బెంగుళూరు లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది శతాబ్ది మన్నా అని, అక్కడే ఆఫ్రికా కు చెందిన స్టూడెంట్ వారెన్ కొకరంగో తో పరిచయం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో శతాబ్ది మన్నా డ్రగ్స్ సరఫరా ఎంచుకుందని, బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదారాబాద్ లో విక్రయిస్తుందని డీసీపీ వినీత్‌ తెలిపారు. MDMA డ్రగ్ డెలివరీ చేసేందుకు మియాపూర్ వచ్చిందని, నిందితురాలి వద్ద 6 లక్షల రూపాయలు విలువ చేసే 60 గ్రాముల MDMA డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Delhi : అప్పుడు మార్షల్స్ ను పెట్టించి అసెంబ్లీ నుంచి వెళ్లగొట్టారు.. కట్ చేస్తే ప్రస్తుతం కాబోయే స్పీకర్