DCP Suresh:హైదరాబాద్ జీడిమెట్లలో కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించిన కూతురి సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కూతురు తన ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై తాజాగా బాలానగర్ డీసీపీ సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అనేక విషయాలను వెల్లడించారు.
Read Also:Shubhanshu Shukla: కుమారుడు రోదసిలోకి వెళ్తుండగా భావోద్వేగానికి గురైన శుభాంశు శుక్లా తల్లి
బాలానగర్ డీసీపీ సురేష్ మాట్లాడుతూ.. అమ్మాయి ప్రియుడు శివ అతని తమ్ముడు ఇద్దరు కలిసి చున్నీతో గొంతు బీగించి చంపారని తెలిపారు. తల్లిని చంపడానికి ఆమె కూతురే శివను ఎంకరేజ్ చేసిందని ఆయన అన్నారు. చున్నీతో గొంతుకు బిగించిన తరువాత చనిపోయిందని అనుకొని అక్కడి నుండి శివ వెళ్ళిపోయాడని.. కానీ, తల్లి చనిపోలేదని పిలిపించి శివతో మళ్ళీ చంపించిందని ఆయన తెలిపారు. శివ పై సరైన ఒపీనియన్ లేకపోవడంతో వీళ్లద్దరి పెళ్లికి తల్లి అంజలి ఒప్పుకోలేదు. అందుకే అంజలిని చంపేసినట్లు తెలిసిందన్నారు.
Read Also:Niranjan Reddy: రైతు భరోసా పథకం ఎత్తేస్తారు.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్..!
తల్లి తన కూతురును ప్రేమ వ్యవహారంలో తరుచూ కొట్టేదని, అందుకే తల్లి పై కక్ష్య పెంచుకుందని అన్నారు. గతంలో ఇదివరకే ఒకసారి శివతో వెళ్ళిపోయిందని, తిరిగి వచ్చిన తరువాత అంజలి మళ్లీ కొట్టిందని డీసీపీ తెలిపారు.
