Site icon NTV Telugu

DC vs MI WPL 2026: జెమిమా రోడ్రిగ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..!

Dc Vs Mi Wpl 2026

Dc Vs Mi Wpl 2026

DC vs MI WPL 2026: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా వడోదర వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్టు ముంబై ఇండియన్స్ ఉమెన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ జట్టు 6 బంతులు మిగిలి ఉండగానే గెలుపు అందుకుంది.

Free LPG Cylinder Scheme: హోలీకి ముందు పేదలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా LPG సిలిండర్‌

ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఉమెన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్ లో నాట్ స్కివర్-బ్రంట్ అజేయంగా 65 పరుగులు (45 బంతుల్లో) చేసి జట్టుకు మంచి స్కోర్ ను అందించింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఇక మిగితా బ్యాటర్లు చెప్పుకో తగ్గ స్కోర్ చేయలేదు. ఢిల్లీ బౌలర్లలో శ్రి చరణి 3 వికెట్లు పడగొట్టింది. మారిజాన్ క్యాప్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది.

Will Malajczuk: వైభవ్ సూర్యవంశీ రికార్డును బ్రేక్ చేసిన ఆసిస్ ప్లేయర్.. యూత్ వన్డేలో ఫాస్టెస్ట్ సెంచరీతో సంచలనం

ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ జట్టు ఆరంభం నుంచే లక్ష్యం వైపు దూసుకెళ్లింది. షఫాలి వర్మ 29, లిజెల్ లీ 46 పరుగులతో మంచి ఆరంభం అందించారు. ఆ ఆతర్వాత వచ్చిన లారా వోల్వార్డ్ 17 పరుగులు చేసింది. అనంతరం వచ్చిన కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ బాధ్యత తీసుకుని అజేయంగా 51 పరుగులు (37 బంతుల్లో) చేసి జట్టుకు విజయాన్ని అందించింది. ఆమెతో పాటు మారిజాన్ క్యాప్ 10 పరుగులతో అజేయంగా నిలిచింది. మొత్తంగా సిరీస్ లో ఢిల్లీ రెండో విజయాన్ని అందుంకుంది. అర్ధశతకంతో జట్టును గెలిపించిన జెమిమా రోడ్రిగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Exit mobile version