శనివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. మ్యాచ్లో భాగంగా టాస్ ముంబై ఇండియన్స్ గెలవగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లో విర విహారాన్ని సృష్టించింది. చివరకి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగులతో విజయం సాధించింది.
Also read: LSG vs RR: టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్.. మొదట బ్యాటింగ్ చేయనున్న లక్నో..
మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 257 పరుగులను సాధించింది. ఢిల్లీ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తనదైన స్టైల్ లో 27 బంతులతో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 84 పరుగులతో వీరవిహారం చేసాడు. మరో ఓపెనర్ కూడా అభిషేక్ 27 బంతులతో 36 పరుగులు జోడించడంతో డెలిహి భారీ స్కోరును సాధించింది. ఇక భారీ లక్ష్యం చేయడంలో ముంబై ఇండియన్స్ మొదటలో తడబడిన ఆ తర్వాత టార్గెట్ వైపు దూసుకువెళ్లింది.
Also read: Yuvraj Singh: అతనికి మాత్రమే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగలిగేది.. యువరాజ్ కామెంట్స్..
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడిన చివరికి మ్యాచ్ ఢిల్లీ గెలిచింది. చివరిలో టిమ్ డేవిడ్ తన చివరి ప్రయత్నంగా బౌండరీలు బాదిన ముంబై ఇండియన్స్ టార్గెట్ దగ్గరకు వెళ్ళింది కానీ.. విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ లో ముఖేష్ కుమార్ 3 వికెట్లు, రషీక్ సలాం 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీయడంతో విజయం ఢిల్లీకి దక్కింది.