Temperatures Falling: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. గత వారం పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే చలి జనం వణికిపోతున్నారు. ఉదయం మంచు కారణంగా రోడ్లు కనబడని స్థితిలో తొమ్మిది గంటల తర్వాత వాహనాలు రోడ్లపై రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇక, పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో.. ఏకంగా 6.6 డిగ్రీల సెల్సీయస్ కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మంచు కురువడం సాధారణం అయినప్పటికీ శీతల గాలులు ఈశాన్యం నుంచి బలంగా వీస్తున్నాయి.
Read Also: Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పండుగ పూట ప్రత్యేక రైళ్లు
అలాగే, హైదరాబాద్ లోనూ చలి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా నగరంలో రాత్రి వేళ్ళలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రానున్న రోజుల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా రికార్డ్ అవుతున్నాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చాలా మంది రాత్రిపూట, తెల్లవారు జామున వెచ్చని దుస్తులను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి.
ఈ సమయాల్లో ఆస్తమా, చర్మ సంబంధ, హృద్రోగ బాధితులు, చిన్న పిల్లలకు న్యూమోనియా వ్యాధుల భయం ఉన్నవారు జాగ్రత్తగా వహించాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే, ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం చలికి వణికిపోతున్నారు. చలి ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తీవ్రంగా ఉండగా.. హైదరాబాద్ నగరంలోను దాని ప్రతాపం చూపిస్తుంది.