Security stops David Warner after scanner shows hotspot on his private parts: ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. వార్నర్ ప్రైవేట్ పార్ట్‌పై హాట్ స్పాట్ కనిపించడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది అతడిని ఆపేశారు. సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసిన అధికారులు.. సమస్యను పరిష్కరించి క్లీన్‌చిట్ ఇవ్వడంతో విమానం ఎక్కి వెళ్లిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఎయిర్‌పోర్టులో జరగ్గా.. కాస్త ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియన్ రేడియో స్టేషన్ ట్రిపుల్ ఎమ్‌లో వార్నర్ సతీమణి కాండిస్ ఈ విషయాన్ని తెలిపారు.
ఆగస్ట్ 25న ప్రముఖ సింగర్ మిలే సైరస్ తల్లి టిష్ సైరస్ వివాహం ఆస్ట్రేలియన్ నటుడు డొమినిక్ పర్సెల్‌తో జరిగింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన భార్య కాండిస్‌తో కలిసి ఆ వివాహ వేడుకలకు హాజరయ్యాడు. పెళ్లి వేడుకల అనంతరం ఆస్ట్రేలియా వెళ్లేందుకు లాస్ ఏంజెలెస్ విమానాశ్రయానికి వార్నర్ చేరుకున్నాడు. సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద బీప్ సౌండ్ రావడంతో.. సిబ్బంది వార్నర్‌ను ఆపారు. వార్నర్ టెస్టికల్స్ వద్ద హాట్‌స్పాట్ ఉన్నట్లు కంప్యూటర్ స్క్రీనింగ్‌లో కనబడింది. ఈ సమస్యను పరిష్కరించిన సిబ్బంది.. వార్నర్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో దేవ్ భాయ్ భార్యతో కలిసి ఆస్ట్రేలియా విమానం ఎక్కేశాడు.
‘డేవిడ్ వార్నర్ వెళ్ళగానే సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద బీప్ సౌండ్ వచ్చింది. దాంతో సెక్యూరిటీ వార్నర్ శరీరాన్ని స్కాన్ చేయగా.. మళ్లీ బీప్ సౌండ్ వచ్చింది. దాంతో నాకు టెన్షన్ వచ్చింది. కంప్యూటర్ స్క్రీన్‌పై ఫలితం కనిపించింది. వార్నర్ ప్రైవేట్ భాగాలపై హాట్ స్పాట్‌ను చూసి అందరూ నవ్వుకున్నారు. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఎట్టకేలకు వార్నర్‌కు క్లీన్ చిట్ ఇవ్వడంతో మేము వెళ్లిపోయాం’ అని కాండిస్ చెప్పారు.
కాండీస్ వివరణ విన్న వైద్య నిపుణుడు డాక్టర్ సామ్ స్పందించాడు. డేవిడ్ వార్నర్ తన ప్రైవేట్ భాగాలపై కుట్లు వేసుకుని ఉండొచ్చు అని పేర్కొన్నారు. క్యాండీస్ వ్యాఖ్యలను ఖండించారు. ‘ లేదు, లేదు.. వార్నర్ ప్రైవేట్ భాగాలపై కుట్లు లేవు’ అని తెలిపారు. ఏదేమైనా వార్నర్ ప్రైవేట్ పార్ట్‌పై హాట్ స్పాట్ ఎందుకు వచ్చిందో తెలియరాలేదు. ఎయిర్‌పోర్టు అధికారులు కూడా దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.