Guest list for IND vs NZ Semi Final 2023: ప్రస్తుతం యావత్ భారత్ క్రికెట్ ఫీవర్‌లో మునిగిపోయింది. భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడెప్పుడు ఆరంభం అవుతుందా? అని క్రికెట్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించడానికి ఫాన్స్ మాత్రమే కాదు.. పలు రంగాలకు చెందిన సెలెబ్రిటీస్ చాలా మందే స్టేడియానికి రానున్నారు. క్రీడారంగానికి చెందిన ప్రముఖులే కాకుండా.. బాలీవుడ్ స్టార్స్, పారిశ్రామికవేత్తలు వాంఖడేకు క్యూ కడుతున్నారు.
భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు దిగ్గజ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్ హాజరుకానున్నారని తెలుస్తుంది. ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ వాంఖడే మైదానంకు రానున్నారని తెలుస్తోంది. ముంబైలోనే మ్యాచ్ జరగనుండడంతో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణవీర్ సింగ్, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ సెమీస్ మ్యాచ్ చూసేందుకు వాంఖడే స్టేడియంకు రానున్నారని సమాచారం. వీరు మాత్రమే కాదు బాలీవుడ్ నుంచి చాలా మంది నటీనటులు రానున్నారని తెలుస్తోంది. మొత్తంగా నేడు వాంఖడే మైదానం స్టార్లతో నిడిపోనుంది.