Site icon NTV Telugu

Daughter Of Ex Iran President: ఇరాన్ మాజీ అధ్యక్షుడి కుమార్తెకు ఐదేళ్ల జైలు శిక్ష

Daughter Of Ex Iran President

Daughter Of Ex Iran President

Daughter Of Ex Iran President: ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు అక్బర్‌ హషేమీ రఫ్‌సంజానీ కుమార్తెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఆమె న్యాయవాది మంగళవారం తెలిపారు. మాజీ అధ్యక్షుడి కుమార్తె ఫేజ్ హషేమీపై వచ్చిన ఆరోపణల వివరాలను న్యాయవాది వెల్లడించలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆరోపణలపై అభియోగాలు మోపారు. పోలీసు కస్టడీలో కుర్దిష్ యువతి మరణించినందుకు ప్రేరేపించబడిన నిరసనల సందర్భంగా టెహ్రాన్‌లో అల్లర్లను ప్రేరేపించడం కోసం ఆమెను అరెస్టు చేసినట్లు సెప్టెంబరులో స్టేట్ మీడియా నివేదించింది.

Paigah Tombs : పైగా సమాధులకోసం యునైటెడ్ స్టేట్స్ ఆర్థిక సహాయం

ఫేజ్ హషేమీ అరెస్ట్‌ తర్వాత, ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది కానీ శిక్ష ఖరారు కాలేదని డిఫెన్స్ న్యాయవాది నేదా షామ్స్‌ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. 2012లో, 2009 వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల నాటి సమయంలో ఫేజ్ హషేమీకి జైలు శిక్ష విధించబడింది. రాజకీయ కార్యకలాపాల నుంచి కూడా నిషేధించబడ్డారు. ఆమె తండ్రి అక్బర్‌ హషేమీ రఫ్‌సంజానీ 2017లో చనిపోయాడు. మాజీ ప్రెసిడెంట్ రఫ్సంజానీ ఆర్థిక సరళీకరణ, పశ్చిమ దేశాలతో మెరుగైన సంబంధాల కోసం ఆచరణాత్మక విధానాలు మద్దతుదారులతో పాటు తీవ్రమైన విమర్శకులను కూడా ఆకర్శించాయి. ఆయన ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకులలో ఒకరు.

Exit mobile version