Shocking : గుజరాత్‌లో దారుణ హత్య జరిగింది. కూతురు, ప్రియుడితో కలిసి ఉండగా తల్లికి ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్ దొరికింది. ఆమెను చూసిన బాయ్ ఫ్రెండ్ పరుగెత్తాడు. తొలుత కూతురు తల్లి ఎదుట ఏమీ ఎరుగనట్లు కన్నీరు పెట్టుకుంది. తన తండ్రికి చెప్పవద్దని వేడుకుంది. ఆ తర్వాత స్టోర్ రూంలోకి వెళ్లి ఓ రేంచ్ తీసుకొచ్చింది. దాంతో తల్లి తలపై పలుమార్లు కొట్టింది. తీవ్రగాయాలతో తల్లి చనిపోయింది. ఈ ఘటన జునాగఢ్‌లోని ఇవ్‌నగర్‌లో చోటుచేసుకుంది. మొదట హత్య మిస్టరీగా ఉంది. హత్య జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని, అయితే తాను ఓ గదిలో ఉన్నానని, తన తల్లి చనిపోయిందనే విషయం తనకు తెలియదని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. పోలీసులు ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా.. తన తల్లిని తానే హత్య చేసినట్లు అంగీకరించింది.
Read Also:Botsa Satyanarayana: టీడీపీని చూసి ఎందుకు భయపడతాం.. మంత్రి బొత్స కౌంటర్
35 ఏళ్ల దక్ష బమానియా ఇంటికి వచ్చినప్పుడు కూతురు మీనాక్షి ఇంట్లో ప్రియుడితో కలిసి కనిపించింది. దీంతో తల్లీకూతుళ్ల మధ్య గొడవ జరిగింది. ఇంతలో బాయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పవద్దని తల్లిని కోరింది. అయితే ఆమె తన తల్లిని ఎందుకో నమ్మలేకపోయిందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఎస్‌ఏ గాధ్వి అన్నారు. స్టోర్ రూమ్ నుంచి రేంచ్ తీసుకొచ్చి దక్ష తలపై పలుమార్లు దాడి చేసింది. ఆమె మరణానంతరం మీనాక్షి తన గదిలోకి వెళ్లి ఏమీ పట్టనట్లుగా పడుకుందని గాధ్వి వివరించారు. జునాగఢ్ తాలూకా పోలీసు అధికారి మీనాక్షిని సోమవారం అరెస్టు చేశారు. 19 ఏళ్ల మీనాక్షి ఇటీవలే పదో తరగతి పాసైంది. ఆమె పనికి వెళ్లి తన కుటుంబానికి సహాయం చేస్తుంది.
Read Also:Delhi Murder Case: సాక్షి హత్య కేసులో సాహిల్ పట్టించిన ఫోన్ కాల్.. నేరం ఒప్పుకున్న నిందితుడు..