Site icon NTV Telugu

AP Crime: ప్రేమించి పెళ్లి చేసుకొంది.. అత్తను కొట్టి చంపింది..!

Secendrabad Crime

Secendrabad Crime

AP Crime: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అయితే కొంత కాలంగా.. అత్త కోడలు పడడం లేదు.. దీంతో.. అత్తను కొట్టి చంపింది కోడలు.. అనకాపల్లి పట్టణం దేవినగర్ లో రుబ్బురోలు పొత్రంతో తలపై కొట్టి 60 ఏళ్ల వృద్ధురాలైన అత్త ఈగల సింహాద్రిని కోడలు ఈగల పూర్ణ(35) హత్య చేసింది.. అనకాపల్లి పట్టణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్ అందించిన వివరాల ప్రకారం.. భర్తతో కలిసి కుమారుడు ఇంటి పక్కన నివాసం ఉంటున్న అత్తను.. కోడలు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రుబ్బురోలు పొత్రంతో తలపై కొట్టి పరారైయింది. రక్తపు మడుగులో ఉన్న అత్తను చూసిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం తో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు, మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నిందితురాలు పరారీలో ఉందని, మృతురాలి కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తరచు వీరు గొడవలు పడేవారిని చెబుతున్నారు.. ఇక, వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. పూర్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ శంకర్రావు తెలిపారు.

Read Also: TDP – Janasena – BJP Alliance: ముగిసిన షెకావత్-చంద్రబాబు-పవన్ భేటీ.. ఎనిమిదిన్నర గంటల పాటు చర్చలు

Exit mobile version