NTV Telugu Site icon

Mulugu: ఫోన్లో వీడియోలు చూస్తున్న కుమార్తెను మందలించిన తల్లి..పురుగుల మందు తాగి ఆత్మహత్య

New Project (14)

New Project (14)

చాలామంది దైనందిన జీవితాల్లో సోషల్‌ మీడియా ఒక భాగమైపోయింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఎక్స్, వాట్సాప్‌ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకూ వినియోగిస్తున్నారు. భారతీయులు సోషల్‌ మీడియా మీద సగటున రోజుకు 2 గంటల 40 నిమిషాలు గడుపుతున్నారు. 18-24 ఏండ్ల వయస్సున్న యువతీ యువకులు మరింత ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కేవలం ఈ వయసు వాళ్లలోనే ఫేస్‌బుక్‌కు 9.72 కోట్ల మంది వినియోగదారులు, ఇన్‌స్టాగ్రామ్‌కు 6.9 కోట్ల మంది వినియోగదారులు భారత్‌లో ఉన్నారు. సోషల్ మీడియాకు యువత, పిల్లలు ఆకర్శితులవుతున్నారు. తల్లిదండ్రులు మందలించడంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుతం క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…

READ MORE: Amritpal Singh: యాంటీ టెర్రర్ చట్టం కింద అమృత్‌పాల్ సింగ్ నిర్బంధం మరో ఏడాది పొడగింపు..

ములగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన కొడ అంకిత (15) ఇంట్లో మొబైల్ ఫోన్లో వీడియోలు చూస్తూ ఉదంతంతో తల్లి మందలించింది. మనస్థాపానికి గురైన అంకిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న కూతురును తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగు విలపించారు. తల్లి గుండెలు బాదుకుంటూ రోదించింది.

Show comments